గురజాడ అప్పారావు
Wikiquote నుండి
గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు . 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు.
[మార్చు] గురజాడ అప్పారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు
- తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
- ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
[మార్చు] గురజాడ అప్పారావుపై చేసిన వ్యాఖ్యలు
- గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ - శ్రీశ్రీ