తెలంగాణ

Wikiquote నుండి

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక భాగము. పూర్వపు నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతమే తెలంగాణాగా పిలువబడుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పరిధిలో 10 జిల్లాలు ఉన్నాయి.

[మార్చు] తెలంగాణా పై ఉన్న వ్యాఖ్యలు

  • నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య.
  • నేను కనుసైగ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది -- కె.చంద్రశేఖరరావు.
  • రాజకీయ పొత్తులతో ఎప్పటికీ తెలంగాణ రాదు -- తెలంగాణ మేధావులు[1]
  • తెలంగాణ తెచ్చేది తెరాస, ఇచ్చేది భాజపా, చచ్చేది కాంగ్రెస్ -- విజయశాంతి.
  • తెలంగాణ వచ్చుడో, కెసీఆర్ సచ్చుడో -- కె.చంద్రశేఖరరావు
  • ఉద్యమాలతో తెలంగాణ రాదు -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
  • తెలంగాణాకు మద్దతినిచ్చే బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటా -- కె.చంద్రశేఖరరావు.
  • ఔర్ ఏక్ దక్కా, తెలంగాణ పక్కా -- సుష్మాస్వరాజ్.
  • తెలంగాణ విడిపోతే ఆంధ్ర, రాయలసీమ వారు హైదరాబాదులో విదేశీయులైపోతారు -- వై.ఎస్.రాజశేఖరరెడ్డి
  • గల్లీ పార్టీలతో తెలంగాణ రాదు, ఢిల్లీ పార్టీలతోనే సాధ్యం -- భాజపా
  • తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[2]

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 16-12-2008
  2. ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=తెలంగాణ&oldid=9954" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె