దేవులపల్లి కృష్ణశాస్త్రి
Wikiquote నుండి
దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రముఖ తెలుగుకవి. ఇతను తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు. ఇతను రచించిన ప్రముఖ కావ్యసంపుటి కృష్ణపక్షము.
దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క ముఖ్య కొటేషన్లు: (ఆయన కవిత్వంలోని ముఖ్యమైన వాక్యాలు)
- నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు?
- దిగిరాను దిగిరాను దివినుంచి భువికి...
- నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు...