భార్య
Wikiquote నుండి
పురుషుడిని వివాహం చేసుకున్న స్త్రీని భార్య అందురు. సతి, పత్ని, ఇల్లాలు అనే పదాలు దీనికి ప్రత్యమ్నాయాలు.
భార్యపై వ్యాఖ్యలు:
- మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్
- నా ఇద్దరు భార్యల వల్లా నాకు దురదృష్టమే ఎదురైంది. మొదటి భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, రెండో భార్య వదిలిపెట్టలేదు. --ప్యాట్రిక్ ముర్రే
భార్యపై సామెతలు:
- ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు.
- ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
- ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట.
- ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
- ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే.
- ఆలుమగల కలహం అన్నం తినేదాకనే.
- ఇంటికి దీపం ఇల్లాలు.
- భార్యమాట బ్రతుకుబాట.
- భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు.
- ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప.