మార్క్ ట్వెయిన్
Wikiquote నుండి
మార్క్ ట్వెయిన్ (Mark Twain) అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత. ఇతడు 1835, నవంబర్ 30న జన్మించాడు. ఏప్రిల్ 21, 1910న మరణించాడు.
మార్క్ ట్వెయిన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.
- ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో!
- పాలకులు నిరంకుశులుగా తయారైతే ప్రజలు అలాంటి వారిని చెత్తబుట్టలో విసిరిపారేస్తారు.
- నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని.
- మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తే ఏమీ బాగుండేది కాదు. ఆ అభిప్రాయభేదాలవల్లే కదా గుర్రప్పందాలు జరుగుతున్నాయి.
- ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు.