విజయనగర సామ్రాజ్యము

Wikiquote నుండి

భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహర, బుక్కరాయలు అను ఇరువులు సోదరులు తుంగభద్ర తీరాన స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాళ్వ, తుళ్వ, ఆర్వీటి అను నాలుగు వంశాలు పరిపాలించాయి. వీరిలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యుడు.

విజయనగర సామ్రాజ్యముపై వివిధ చరిత్రకారులు, చారిత్రక పర్యాటకుల వ్యాఖ్యలు:

  • రోం నగరమంత పెద్దదిగాను, సుమ్దరమైనది గాను నాకు విజయనగరం కనిపించింది.
    • చారిత్రిక పర్యాటకుడు పేస్ ప్రకటించించిన వ్యాఖ్య (ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, పేజీ 174)
  • విజయనగరం కేవలం రాజ్యం కాదు, సామ్రాజ్యం.
    • విజయనగరాన్ని పర్యటించిన పోర్చుగీసు పర్యాటకుడు న్యూనిజ్ వ్యాఖ్య (ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, పేజీ 172).
  • ఈ రాజుల వద్ద 10లక్షల సైన్యం ఉంది. ఏ క్షణంలోనైనా ఈ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.
    • పోర్చుగీసు పర్యాటకుడు పేస్ వ్యాఖ్య.
  • విజయనగర రాజులు ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం సమకూర్చగలరు.
    • పోర్చుగీసు పర్యాటకుడు న్యూనిజ్ వ్యాఖ్య.
  • సప్త ప్రాకారములచే చుట్టబడిన 7 దుర్గములు ఈ నగరములో ఉన్నవి.
    • విజయనగరాన్ని పర్యటించిన అబ్దుల్ రజాక్ వ్యాఖ్య.

ఇవి కూడా చూడండి [మార్చు]