వేమన
Wikiquote నుండి
వేమన 1650-1750 మధ్య కాలములో జీవించి తెలుగు కవి. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు.
వేమన పద్యాలలో అంతర్లీనంగా ఉన్న వ్యాఖ్యలు [మార్చు]
- అనువుగానిచోట అధికులమనరాదు.
- అప్పులేనివాడె యధిక సంపన్నుడు.
- ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరె పోవువాడు వెర్రివాడు
- ఇంటిలోని పోరు నింతింత గాదయా.
- ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు.
- కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా
- కోపమున ఘనత కొంచెమైపోవును.
- గంగి గోవుపాలు గరిటడైనను చాలు, కడవెడైనను నేమి ఖరము పాలు.
- చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా.
- తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు.
- తల్లితండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి?
- తినగ తినగ వేము తియ్యనుండు
- పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు.
- పురుషులందు పుణ్య పురుషులు వేరయ.
- సాధనమున పనులు సమకూరు ధరలోన
- నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల