సామెతలు - న
Wikiquote నుండి
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"న" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
- నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
- నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
- నలుగురితో నారాయణా
- నల్లటి కుక్కకు నాలుగు చెవులు
- నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
- నవ్విన నాపచేనే పండుతుంది
- నాగస్వరానికి లొంగని తాచు
- నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
- నిండా మునిగిన వానికి చలేంటి
- నిండు కుండ తొణకదు
- నిఙ౦ నిప్పులా౦టిది
- నిజం నిలకడమీద తెలుస్తుంది
- నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
- నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు
- నిప్పులేనిదే పొగరాదు
- నివురు గప్పిన నిప్పులా
- నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
- నీటిలో రాతలు రాసినట్లు
- నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
- నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
- నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
- నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
- నూరు చిలుకల ఒకటే ముక్కు
- నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
- నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
- నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
- నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
- నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
- నేతిబీరలో నేతి చందంలా
- నేల విడిచి సాము చేసినట్లు
- నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది