అన్నవరం దేవేందర్
స్వరూపం
అన్నవరం దేవేందర్
[మార్చు]అన్నవరం దేవేందర్ కవి, రచయిత, కాలమిస్ట్ ఇరవై అయిదేళ్ళుగా నిరంతరం తెలంగాణ తెలుగు పదాలతో కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికి 12 కవితా సంపుటాలు 2 వ్యాస సంకలనాలు వెలువరించారు. వీరు 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసారు. ఇప్పటికీ కవిత్వంతో పాటు పలు పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు. మన తెలంగాణా పత్రికలో 'ఊరి దస్తూరి' కాలం చాలా విశిష్టమైనది. ఇది తెలంగాణ సంస్కృతిక చిత్రణగా పుస్తకంగా వెలువడింది. అన్నవరం కవిత్వం ఆంగ్లంలో కూడా వెలువడింది. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం తెచ్చిన వారిలో అన్నవరం ముందుంటారు.