ఆశపూర్ణా దేవి
స్వరూపం
ఆశాపూర్ణా దేవి (బెంగాలీ: আশাপূর্ণা দেবী), బెంగాలీ నవలా రచయిత్రి, కవయిత్రి. ఆమె జనవరి 8 1909 న జన్మించారు.ఆమెకు అనేక బహుమతులు, అవార్డులు లభించాయి. 1976 లో జ్ఞానపీఠ అవార్డు, భారత ప్రభుత్వం చే పద్మశ్రీ అవార్దు అందుకున్నారు. ఆమె నవలా రచయిత్రిగా, లఘు కథా రచయిత్రిగా చేసిన కృషికి 1994 లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ తో సత్కరించారు. ఆమె 1995 లో మరణించారు.
వ్యాఖ్యలు
[మార్చు]స్త్రీలు కూడా మనుషులే. మానవ హక్కులు స్త్రీ పురుషులిద్దరికి సమానమే. మహిళలే తమ అంతట తాము పురుషాధిక్యత కు తలోగ్గితే సమానత్వం కలగానే మిగులుతుంది. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూసాగే కుటుంబ జీవితమే నేటి సమాజానికి అవసరం.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు.2026-01-06.
