ఓషో
స్వరూపం
ఓషో (ప్ర)వచనాలు
[మార్చు]Osho, The Luminous Rebel (2009) by Vasant Joshi
[మార్చు]- ఒక పరిపూర్ణ వ్యక్తే పవిత్రమైన వ్యక్తి కాగలడు (Only a whole person can be a holy person.) (p. 19).
- ప్రజలు ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండో అర్థం చేసుకొంటారు - అది సమస్య కాదు - ఏదో ఒక రోజు వారు అర్థం చేసుకొంటారు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అది సర్వ మానవాళికి భవిష్యత్తు తత్త్వశాస్త్రం, భవిషష్యత్తు మతం అవుతుంది. People may understand today or tomorrow or day after tomorrow— that doesn’t matter—but one day they will understand it. One thing I can say that, whatever I am saying is going to be the future philosophy, the future religion, of the whole humanity. (p. 22).
ఓషో గురించి ఇతరులు
[మార్చు]- ‘బుద్ధుడి తర్వాత సంభవించిన ఒక మహత్తర పునర్జన్మ ఓషో. అతడే మన కళ్ళ ముందు ఉన్న బుద్ధుడు.’
(Osho is the greatest incarnation after Buddha in India. He is a living Buddha.) - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 8). Wisdom Tree.
- ఓషో సంచలనాలు, మిగతా వారి సంచలనాల కంటే తీవ్రమైనవి. ఎందుకంటే ప్రభుత్వాలకు, మతాలకు, పాత నమ్మకాలకు వ్యతిరేకంగా నిజాలను నిర్భయంగా, బహిరంగంగా బయటపెడతాడు కాబట్టి. 'తనకు తానే ఒక వర్గం' గా ప్రకటించుకున్నాడు. (With regards to Osho, the controversy is more intense because he speaks his truth against governments, religions and old beliefs publicly and without fear. He declares that 'he is a category by himself'. - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 18).
ఓషో తన గురించి తాను
[మార్చు]- ‘మానవత్వ చరిత్రను వ్యతిరేకించగలిగేది నేనొక్కడినే. అందరూ నన్ను ఎప్పుడూ అపార్థమే చేసుకొన్నారు -- బహుశా అదే నా విధి ఏమో.’
((I am) one man against the whole history of humanity. People have always misunderstood me -- perhaps that is my destiny.) - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 10)
- ఒక సరిక్రొత్త మతపరమైన జాగరూకతకు నేను నాందిని. నన్ను గతంతో కలపవద్దు. గతాన్ని అసలు గుర్తుంచుకోవడం కూడా అనవసరం. (I am the beginning of a totally new religious consciousness, please don’t connect me with past; it is not even worth remembering.) - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 17).
- నేను బోధించటానికి రాలేదు. నేను నెలకొల్పడానికి వచ్చాను. (I have not come to teach, I have come to awaken.) - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 17).
- నేను నేర్పేది ఫక్తు తిరుగుబాటు. రాజీ పడటానికి నేను ఇక్కడికి రాలేదు. ఏది ఏమైనా నేను నిజాయితీ గా ఉంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. (I teach utter rebellion. I am not here to compromise. I have decided to be utterly honest and truthful whatsoever the cost.) - Joshi, Vasant. Osho, The Luminous Rebel (p. 17).