కళ
స్వరూపం
ఒక వస్తువును, ఒక పనిని ఆకర్షణీయంగా, అందంగా మలిచే విద్యే కళ.
మేధస్సును, జ్ఞానాన్ని, భావోద్రేకాన్ని ఆకర్షించే విధంగా; ఆసక్తి గొలిపే విధంగా, కొన్ని అంశాలను శ్రద్ధగా అమర్చే ప్రక్రియ లేదా సృష్టి ని కళ అంటారు. సంగీతం, సాహిత్యం వంటి అనేకానేక కళలు పలురకాల సృష్టి, భావోద్రేకాన్ని వ్యక్తీకరించే విధానాలు. తత్వ శాస్త్రం లోని ఈస్థెటిక్స్ అనే విభాగం కళను నిర్వచిస్తుంది.
వ్యాఖ్యలు
[మార్చు]సౌందర్యం
[మార్చు]- కళ విలువ అందం కాదు సరియైన స్పందన. - సోమర్సెట్ మామ్
- సౌందర్యం, సత్యం వీటి రసవత్సమ్మేళనమే కళ.----రవీంద్రనాథ్ ఠాగూర్
భావ వ్యక్తీకరణ
[మార్చు]- కళ అనేది ఒక విశ్వజనీనమైన భాష.---లియో టాల్స్టాయ్
కళ/సాంకేతికత
[మార్చు]- కళ లేని సాంకేతికత లోతు లేనిది, విఫలమైనది. సాంకేతికత లేని కళ అవమానకరమైనది. - డోరోతీ అలెగ్జాండర్ అనే బాలె నృత్యకారిణి.