కాంచనపల్లి గోవర్థన్ రాజు
స్వరూపం
కాంచనపల్లి గోవర్థన్ రాజు
[మార్చు]కాంచనపల్లి గోవర్ధన్ రాజు చిన్నతనంలో బడికెళ్లే రోజునుండి పద్యరచన అలవాటు. ఇంటర్మీడియట్లోనే 'భావమంజరి' అనే పద్యకృతి ప్రచురితమైంది. 1995లో ఇతర కవిమిత్రులు ఇద్దరితో కలిసి 'ఆచూకీ' కవితా సంకలనం తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'తండ్లాట' శీర్షికన కవిత్వం సృజించారు. అనేక కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమాలలో పలు సాహిత్య కార్యక్రమాలలో క్రియాశీలక పాత్రని పోషించారు.