గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
స్వరూపం
గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
[మార్చు]గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గొప్ప కవి. శతావధాని. ఇతను తన 11వ యేట బ్రహ్మోపదేశమైన తరువాత తండ్రివద్దనే షోడశకర్మలు, యజుర్వేద సంహిత, అరుణపంచకము, ఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించాడు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము చేశాడు. నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు.
రచనల నుంచి ఉదాహరణలు:
[మార్చు]1. ధర మధురాధర ధర సుధారస ధారలన్ ద్వజించి యే యిరవుననో సుధల్ దొరకు నెంతయునంచు దలంచు టెంచగా దొరికిన పెన్ని ధానమును దొంగల కిచ్చుచు రిత్త నేల యం దరయ ధానాప్తికై వెదకునట్టి తెరంగగుగాదె ధీమణి!
2. అన్నా! విద్య్దెల నెల్ల నేర్చితివె, నెయ్యం బార నీ యొజ్జలున్ సన్నాహంబున నేర్పిరే, యిపుడికే సందేహమున్ లేక నీ విన్నాళ్ళున్ బఠియించు శాస్త్రమున నేదే నొక్క పద్యంబు సం పన్నార్థంబుగ నీ సుధా మధుర వాక్ప్రావీణ్యతన్ చెప్పుమా!