చిన్మయానంద సరస్వతి
స్వరూపం

అసలు పేరు లేదా జన్మ నామము పూతమ్పల్లి బాలకృష్ణన్ మీనన్ ( 1916 మే 8 - 1993 ఆగస్టు 3). ఆశ్రమ నామము స్వామి చిన్మయానంద సరస్వతి అయినప్పటికీ స్వామి చిన్మయానందగా పరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ మిషన్ స్థాపకులు. ఈ సంస్థ ద్వారా అద్వైత వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర పురాతన హిందూ రచనల జ్ఞానాన్ని పంచుతున్నారు.
వ్యాఖ్యలు
[మార్చు]ఉద్వేగాలు, అనుభూతల వల్ల తప్పుదారి పట్టకుండా తాము చేపట్టే అన్ని కార్యకలాపాల్లోను తెలివితేటల్ని వినియోగించగలగడమే విజేతల రహస్యం. జీవితంలో విజయం సాదించాలంటే హృదయం తాలూకు తుపానుల్ని తలదాకా రానివ్వకూడదు.
మూలాలు
[మార్చు]ఈనాడు, మే 8, 2025
