దాశరథి కృష్ణమాచార్య
స్వరూపం
(దాశరథి నుండి మళ్ళించబడింది)
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న గ్రామంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనను తన రచనల ద్వారా వెలిబుచ్చిన మహాకవి. 1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.
దాశరథి యొక్క ముఖ్య కొటేషన్లు
[మార్చు]- నా తెలంగాణ కోటి రతనాల వీణ.
- ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని. - మా నిజాము రాజు జన్మజన్మల బూజు
- నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడామూస:ఆధారం - నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న - రజాకార్ల ఈ రాజ్యం ప్రజావళికి యమకూపం, మతదురహంకారానికి ఇదే నగ్న నిజరూపం[1]
- ముసలి నక్కకు రాజరికంబు దక్కునే[2]
- అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం.[3]
- ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా![4]
- శవం బతకడం ఎంత విచిత్రమో, మనం మేలుకోవడమూ అంత విచిత్రమే.
- సురవరం ప్రతాపరెడ్డి గురించి
- పాత్రికేయుడో! అతడు, రాజకీయ దురంధరుడో! పండితుడో! వ్యాఖ్యతయో! అన్నీ ఒకటైనవాడో![5]
మూలాలు
[మార్చు]- ↑ ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పేజీ 67
- ↑ (నిజాం నవాబును విమర్శించుతూ చేసిన వ్యాఖ్య)స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరీనాథ్, 1994 ప్రచురణ, పేజీ 58
- ↑ దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం,కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-36
- ↑ దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(రూపాయికి విలువలేని రోజు...),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-66
- ↑ దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-32