దాశరథి కృష్ణమాచార్య

వికీవ్యాఖ్య నుండి
(దాశరథి కృష్ణమాచార్యులు నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న గ్రామంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనను తన రచనల ద్వారా వెలిబుచ్చిన మహాకవి. 1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.

దాశరథి యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

 • నా తెలంగాణ కోటి రతనాల వీణ.
 • ఓ నిజాము పిశాచమా, కానరాడు
  నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.
 • మా నిజాము రాజు జన్మజన్మల బూజు
 • నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
  గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడామూస:ఆధారం
 • నిన్ను గెలవాలేక రైతన్నా......
  నిజాం కూలింది కూలన్న
 • రజాకార్ల ఈ రాజ్యం ప్రజావళికి యమకూపం, మతదురహంకారానికి ఇదే నగ్న నిజరూపం[1]
 • ముసలి నక్కకు రాజరికంబు దక్కునే[2]
 • అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం.[3]
 • ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా![4]
 • శవం బతకడం ఎంత విచిత్రమో, మనం మేలుకోవడమూ అంత విచిత్రమే.
సురవరం ప్రతాపరెడ్డి గురించి
 • పాత్రికేయుడో!అతడు,రాజకీయ దురంధరుడో!పండితుడో! వ్యాఖ్యతయో! అన్నీ ఒకటైనవాడో![5]

మూలాలు[మార్చు]

 1. ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పేజీ 67
 2. (నిజాం నవాబును విమర్శించుతూ చేసిన వ్యాఖ్య)స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరీనాథ్, 1994 ప్రచురణ, పేజీ 58
 3. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం,కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-36
 4. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(రూపాయికి విలువలేని రోజు...),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-66
 5. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-32


w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.