దాసు శ్రీరాములు
స్వరూపం
దాసు శ్రీరాములు (1846 - 1908) (దాసు శ్రీరాములు పంతులు లేదా దాసు శ్రీరామమంత్రి) ప్రసిద్ధ కవి, పండితులు, న్యాయవాది. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. తరువాతి కాలంలో ఆంగ్లం చదివి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరై ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.
వ్యాఖ్యలు
[మార్చు]- వీరు ఆశువుగా, 6 నెలల్లో తెనిగించిన ఆంధ్ర దేవీ భాగవతము ప్రత్యేక సాహిత్య కావ్యము. ఆయన్ని ఆశుకవి సింహులు అని పిలిచేవారట. ఇవి గాక జావళీలు, పదములు, బహు కృతులు కూడా ఆయనచే రచింపబడినవి.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి. 2020-10-15.
