వాడుకరి:నాగభైరవ జయప్రకాష్ నారాయణ
స్వరూపం
(నాగభైరవ జయప్రకాష్ నారాయణ నుండి మళ్ళించబడింది)
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఐ.ఏ.ఎస్. పరీక్షలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి కలెక్టర్ మరియు ఉన్నత రాష్ట్రపదవులు పొందినాడు. 1996లో ఉద్యాగానికి రాజీనామా సమర్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి "లోక్‌సత్తా" పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత అదే పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటుచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ముఖ్య కొటేషన్లు
[మార్చు]- ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు.
- రాష్ట్రంలో తోడేళ్ళ పోరాటం జరుగుతోంది, ప్రజలు మేకల్లా చుట్టూ చేరారు [1]
- ఏ సమస్యపై చర్చ జరగనప్పుడు అసలు సమావేశాలకు ఎందుకు రావాలో అర్థం కావడం లేదు [2]
- ఓట్లు వేయగానే ప్రజాస్వామ్యమనిపించుకోదు [3]
- నగదు బదిలీ లంచమే [4]
- "ఆత్మహింస" అనే గేమును ప్రవేశపెడితే అందులో గోల్డ్,సిల్వర్,బ్రాంజ్ అన్ని పతకాలు మనకే దక్కుతాయి.[5]