Jump to content

ఫ్రెడెరిక్ నీషె

వికీవ్యాఖ్య నుండి
ఫ్రెడరిక్ నీషె

,

ఫ్రెడెరిక్ నీషె (15 అక్టోబర్ 1844 – 25 ఆగస్టు 1900) ప్రముఖ జర్మనీ తత్వవేత్త. "అన్ టైమ్‌లీ థాట్స్", "హ్యూమన్ ఆల్ టూ హ్యూమన్", "ది డాన్ ఆఫ్ ది డే", "ది జాయ్ ఫుల్ సైన్స్", "దస్ స్పోక్ జొరాస్ట్ర" గ్రంథాలు రాసి ప్రచురించాడు. ఇవి బాగా ప్రసిద్ధి చెందాయి. తర్వాత "బియాండ్ గుడ్ అండ్ ఈవిల్", "ది జీనాలజి ఆఫ్ మోరల్స్" స్వీయ చరిత్రగా ఈకే హోమో రాశాడు. చనిపోయాక ప్రచురితమైన గ్రంథం "ది యాంటి క్రైస్ట్ అండ్ ది విల్ టు పవర్". దీనికి "హౌ టు ఫిలాసఫైజ్ విత్ హామర్" అని టాగ్ తగిలించాడు.

== వ్యాఖ్యలు == [[1]]

  • "భయం నైతికతకు తల్లి..!"
  • "ప్రజలు 'సత్యం' తెలుసుకోవాలని అనుకోరు. ఎందుకంటే అది అప్పటివరకూ వారు నమ్ముతున్న కల్పితకథల్ని, నమ్మకాలను పటాపంచలు చేస్తుంది కాబట్టి"
  • "యువతను భ్రష్టు పట్టించే ఖచ్చితమైన మార్గం ఏంటంటే... భిన్నంగా కాకుండా ఒకే మూసలో ఆలోచించేవారిని అనుసరించమని సూచించడం"
  • "మీకు మనశ్శాంతి, ఆనందం కావాలనుకుంటే అప్పటివరకూ ఉన్న నమ్మకాలను గుడ్డిగా అనుసరిస్తే సరిపోతుంది. ఒకవేళ సత్యం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఘర్షణ తప్పదు"
  • "వివాహితుల మధ్య ప్రేమ లేకపోవడం వలన కాదు.. స్నేహం లేకపోవడం వలననే అసంతృప్తితో జీవిస్తారు"
  • "చాలామంది ముప్పై సంవత్సరాలకే మరణిస్తారు.. కానీ డెబ్బై సంవత్సరాల తర్వాత ఖననం చేయబడతారు"
  • "ఒంటరిగా ఉన్న మనిషే ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాడు"
  • "మనం ఎంత ఎత్తుకు ఎగురుతామో.. అలా ఎగరలేనివారికి మనం అంత చిన్నగా కనపడతాము"
  • "నువ్వు నాతో అబద్ధం చెప్పినందుకు నాకు బాధ లేదు. అప్పటినుండి నిన్ను నమ్మలేకపోతున్నాను చూడూ..! అందుకు బాధపడుతున్నాను"
  • "నాకు తెలిసి ఒకే ఒక్క నిఖార్సయిన క్రైస్తవుడు ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తూ అతను శిలువమీదే మరణించాడు"
  • "గౌరవప్రదమైన ఏ వ్యక్తయినా చనిపోయినవారి భావాల చేత పరిపాలించబడడానికి తనను తాను అనుమతించబోడు"

మూలాలు

[మార్చు]

https://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D_%E0%B0%A8%E0%B1%80%E0%B0%B7%E0%B1%86

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.