మావో జెడాంగ్
స్వరూపం
(మావో నుండి మళ్ళించబడింది)
మావో జెడాంగ్ (Mao Zedong) డిసెంబర్ 26,1893 న జన్మించాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా రిపబ్లి అధ్యక్షుడిగా పనిచేశాడు. సెప్టెంబర్ 9,1976 న మరణించాడు.
మావో యొక్క ముఖ్య కొటేషన్లు
[మార్చు]- మన శత్రువులెవరు? మన స్నేహితులెవరు? ఇది విప్లవంలో తొలి ప్రాధాన్యత కలిగిన ప్రశ్న.
- అనాలసిస్ ఆఫ్ క్లాసెస్ ఇన్ చైనీస్ సొసైటీ (మార్చి 1926), సెలెక్టెడ్ వర్క్స్, వాల్యూం. I, పేజీ. 1.
- విప్లవం అనేది విందుభోజనం కాదు. లేదా వ్యాసం రాయడమో, చిత్రలేఖనం చేయడమో, ఎంబ్రాయిడరీ చేయడమో కాదు. అదేమీ విశుద్ధంగా ఉండదు, సావకాశంగా, మృదువుగా, సమశీతోష్ణంగా, దయగా, మర్యాదగా, నియంత్రితంగా, ఉదారంగా ఉండే వీలులేదు. విప్లవం ఓ తిరుగుబాటు, ఒక వర్గం మరొక వర్గాన్ని దెబ్బతీసి అవతలకునెట్టే హింసాత్మక ఘటన.
- రిపోర్ట్ ఆన్ యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది పీసెంట్ మూవ్ మెంట్ ఇన్ హునాన్ (మార్చి 1927)
- వేయి పూలు వికసించనీ, వేయి భావాలు సంఘర్షించనీ.
- వృద్ధాప్యం రూపంలో కంటే మనసులో ముడతలు తెస్తుంది.