మేఘనాధ్ సాహా
స్వరూపం

మేఘనాధ్ సాహా (1893 అక్టోబరు 6 — 1956 ఫిబ్రవరి 16) భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.
వ్యాఖ్యలు
[మార్చు]- సైన్స్ లో అయినా దేశానికయినా జరగాల్సిన పనులు సరిగ్గా జరగాలంటే - సమర్థులూ తగిన శిక్షణ పొందినవారి చేతిలోనే కీలక బాధ్యతలు ఉండాలి. రూల్ ఆఫ్ రీజన్ అండ్ సైన్స్ ని అమలు చేసినప్పుడే సమాజం ముందుకెళ్తుంది.[1]
- పెద్ద పెద్ద ప్రాజక్టులు భారీ పరిశ్రమలు దేశానికి చాలా అవసరం. అందులో సందేహమే లేదు . అయితే అంతకన్నా ముఖ్యమైనవి సమాజంలో అత్యంత బలహీనుడైన సామాన్య మానవుడి అవసరాలు. అవి చూసాకే మిగిలినవి ఏవైనా. [2]
