Jump to content

వయోజన విద్య

వికీవ్యాఖ్య నుండి

వయోజనులకు విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసినప్పుడే, ప్రజలందరూ విద్యావంతులు కాగలరు.

వ్యాఖ్యలు

[మార్చు]

గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించిన కీర్తన:

చదువులు చదువుటకన్న - బహు
శాస్త్రజ్ఞానము కెదిత్రోవన్న? ......చ॥
ఆచదువు మనకురాకున్న - మన
సంసారములను సుఖములు సున్న..... చ॥

చింతలను తొలగించు - సిరిని తన
చెంతకును పిలిపించు - యెన్నో
మంతనముల నెఱిగించు - ధీ
మంతులుగా జనముల నొనరించు ..... చ॥

వినయమునకు అది నెలవు - బహు
విద్దియలందున గలవు - వృ
త్తులకును గూర్చును చెలువు - ని
స్తులమని దానిని పిలువు.....చ॥

ఇహసౌఖ్యము కది వెరవు - మోక్షపు
మహలున కదియే తెరువు
అదియుంటే కలుగదు కరువు
లేకుంటే బ్రతుకే బరువు ..... .......చ॥