Jump to content

వికీవ్యాఖ్య:అటల్ బిహారీ వాజపేయి

వికీవ్యాఖ్య నుండి

అటల్ బిహారీ వాజపేయి డిసెంబరు 25, 1924న జన్మించాడు. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడైన వాజపేయి మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రి పదవిని నిర్వహించాడు. ఆ తరువాత వయోభారం వల్ల రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినాడు.


వాజపేయి ముఖ్య కొటేషన్లు

[మార్చు]
  • జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.
  • సామాజిక న్యాయం లేకుండా స్వేచ్ఛ అసంపూర్ణంగా ఉంటుంది.[1]
  • భారతదేశంలో ధైర్యవంతులైన యువతీ యువకులకు కొరత లేదు, వారికి అవకాశం, సహాయం లభిస్తే మనం అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాలతో పోటీ పడగలం, వారిలో ఒకరు ఆమె కలలను నెరవేరుస్తారు.
  • సంకల్పమే మార్గాన్ని చూపుతుంది.
  • వ్యక్తి సాధికారతకు ప్రాధాన్యమిస్తే అది దేశాన్ని శక్తిమంతం చేస్తుంది.ఆర్థికాభివృద్ధికి సామాజిక మార్పు తోడైనప్పుడే సాధికారత వేగవంతమవుతుంది.అవినీతి విషయంలో మాత్రం రాజీ ప్రసక్తే రాకూడదు.[2]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.