శాంతి స్వరూప్ భట్నాగర్
స్వరూపం

శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది) లో జన్మించాడు. భారత దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే.
వ్యాఖ్యలు
[మార్చు]- వ్యవసాయము పరిశ్రమలు పూర్తిగా అభివృద్ధి చెందితేనే దేశం లో సైన్స్ కి భవిష్యత్తు ఉంటుంది . ప్రజల ఆరోగ్యం, ఆహారం అన్నీ ఈ రెండిటి మీదే ఆధార పది ఉంటాయి. భౌతిక ప్రయోజనాలకు వర్తింపచేసినప్పుడే శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనలు రాణిస్తాయి . [1]
- "శాస్త్రవిజ్ఞానాన్ని పుస్తకాలలో మాత్రమే కాక, పరిశ్రమలలో, పొలాలలో జీవింపజేయాలి."[2]
