సచిన్ టెండుల్కర్
స్వరూపం
(సచిన్ టెండూల్కర్ నుండి మళ్ళించబడింది)
సచిన్ టెండుల్కర్ ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. క్రికెట్‌లో అనేక ప్రపంచ రికార్డులు నమోదుచేశాడు.
సచిన్ టెండుల్కర్ పై ముఖ్యమైన వ్యాఖ్యలు
[మార్చు]- మైదానంలో వీక్షించేందుకు టెండుల్కల్ బ్యాట్ కంటె అద్భుతమైన వస్తువు మరొకటి ఉండదు -- హర్ష భోగ్లే.
- సచిన్‌ను ఆరాధించినంతగా ప్రజలు నన్ను ఆరాధించకపోవచ్చు - షారుఖ్ ఖాన్.
- సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- నేనో దేవుణ్ణి చూశా, అతను భారత్ తరఫున టెస్టుల్లో నాలుగవ బ్యాట్స్‌మెన్‌గా వస్తాడు. అతను కోట్ల మందికి దేవుడు -- మాథ్యూహేడెన్
- సచిన్ రిటైరైతే టెస్టులు చచ్చిపోతాయి-- రణతుంగ[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక తేది 23-02-2013