సత్యసాయిబాబా
(సత్య సాయి బాబా నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
సత్యసాయిబాబా నవంబరు 23, 1926న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జన్మించాడు. ప్రముఖ అధ్యాత్మికవేత్తగా వెలుగొంది ఏప్రిల్ 23, 2011న మరణించాడు.
సత్యసాయిబాబా యొక్క ముఖ్య ప్రవచనాలు, వాక్యాలు, కొటేషన్లు[మార్చు]
- అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది.
- ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం
- తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాత్మికత అంతే అర్థమౌతుంది.
- ధనం వస్తుంది, పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది.
- రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు.
- ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి.
- కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువ్వులాంటివి..ఎక్కువైతే జీవిత పయనం కష్టమౌతుంది.
- క్రమశిక్షణ సరిగా ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
- అన్నం పెట్టేవాళ్లు,అమృతం పెట్టేవాళ్లేకాదు విషం పెట్టేవాళ్లు కూడా నావాళ్లే.
- మనిషి తనలోని ఈర్ష్య,అసూయ,ద్వేషాలను,కోరికలను,ప్రాపంచిక సుఖ భోగాలను త్యజిస్తూ పోతే అదే నిజమైన భగవత్ పూజ