వికీవ్యాఖ్య:రచ్చబండ

వికీవ్యాఖ్య నుండి
(WQ:VP నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
అడ్డదారి:
WQ:VP

వికీవ్యాఖ్యకు మీ సాయం[మార్చు]

కొన్ని వ్యాఖ్యలు చదవడమంటే చరిత్రతో సంభాషించడం, కొన్ని వ్యాఖ్యలు చదవడమంటే భవిష్యత్తును వెలిగించడం, కొన్ని వ్యాఖ్యలు చదవడమంటే వర్తమానాన్ని జ్వలించడం అలాగే కొన్ని హాస్యాన్ని పంచుతాయి, కొన్ని చమత్కారాన్ని మప్పుతాయి, కొన్ని మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తాయి. ఇది అటువంటి రాసుకోదగ్గ అన్ని వ్యాఖ్యలకు వేదిక. సినిమాలో డైలాగే కావచ్చు, ఓ పాటలోని రాసుకోదగ్గ ముక్కే కావచ్చు, ఓ వ్యక్తి జీవితాన్ని గురించో, ప్రేమను గురించో, మనుషులకు సంబంధించిన విషయంలోని ఏ ఒక్క దాని గురించో ఎక్కడో చెప్పింది కావచ్చు, ఓ కవితాభాగం కావచ్చు, కథలోనో, నవలలోనో సంభాషణో, గొప్ప భావనో ఏదోకటి కావచ్చు. అవి తెలుగులోవే కావచ్చు, మీరే వేరే భాష నుంచి అనువదించినవే కావచ్చు. ఇక్కడ వాటిని సంబంధిత పేజీల్లో రాయండి. ఇప్పటి దాకా పేజీలు లేకుంటే తయారు చేయండి. రండి నాలుగు ముక్కలు పంచుకుందాం. --pavan santhosh (చర్చ) 15:05, 3 ఫిబ్రవరి 2015 (UTC)

కొత్తగా మార్పులు[మార్చు]

వెంకటరమణ, పవన్ సంతోష్, నాయుడుగారి జయన్నరాజశేఖర్, గార్లకు,

 • రచ్చబండను సైడుబారులో పెట్టాను. అలాగే ఈ సైడుబారును తెలుగు వికీకి మళ్ళే తీర్చిదిద్దాను.
 • దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుతున్న బాక్సు క్రిందివచ్చే చిన్న చిన్న మూసల లింకులు మొదలైనవి ఇక్కడ కూడా చేర్చాను
 • ట్వింకిల్, హాట్‌కాట్, నావిగేషన్ పాపప్స్ తదితర ఉపకరణాలన్నీ వ్యవస్థాపితం చేశాను. అవి మీ అభిరుచుల్లో ఉపకరణాల టాబుకు వెళ్ళి సచేతనం చేసుకోవచ్చు
 • దిద్దుబాటు పెట్టెలో సైట్ మెనూను కూడా ఇక్కడ చేర్చాను.

ఇక ఇక్కడ కూడా దాదాపు తెలుగు వికీపీడియాలో పనిచేసినట్టుగానే ఉండాలి. మరో రెండు పనులు ఇంకా జరుగుతున్నవి / జరిగేవి ఏవిటంటే

 • Wikiquote పేరుబరిని వికీవ్యాఖ్యగా నామాంతరం చేయిస్తున్నా, దానితో ప్రాజెక్టు పేరు అధికారికంగా వికీవ్యాఖ్య అవుతుంది.
 • ఇక విశ్వనాథ్ గారి లాంటివాళ్ళు వికీవ్యాఖ్య లోగోను తెలుగులో తయారుచేస్తే, లోగో కూడా తెలుగులో మార్చేయవచ్చు
 • బొమ్మలు స్థానికంగా అప్లోడుచేసే సౌకర్యం కల్పించే ప్రయత్నం మొదలుపెట్టాను కానీ అది అంత సులభంగా అయ్యేట్టు లేదు

ఇంకా ఏవైనా చెయ్యాలంటే ఇక్కడ వ్రాయగలరు --వైజాసత్య (చర్చ) 03:13, 26 ఫిబ్రవరి 2015 (UTC)

మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. వీనిమూలంగా పనిచేస్తున్న సభ్యుల పని సుళువుగా చేయడానికి వీలవుతుంది.--Rajasekhar1961 (చర్చ) 07:35, 26 ఫిబ్రవరి 2015 (UTC)
వైజాసత్య గారికి, ట్వింకిల్ ను నా అభిరుచుల్లో చేర్చుకున్నాను. అయితే welcome మూసకు స్వాగతం చేస్తున్న సమాచారం లింకు కాలేదు. దయచేసి సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 07:40, 26 ఫిబ్రవరి 2015 (UTC)
రాజశేఖర్ గారూ, స్వాగతం మూస పనిచేసేట్టు చేశాను. పరీక్షించి చూడండి --వైజాసత్య (చర్చ) 12:43, 4 మార్చి 2015 (UTC)
వికీ వ్యాఖ్యను తీర్చిదిద్దటంలో శ్రమిస్తున్నవైజాసత్యగారికి ధన్యవాదాలు--Naidugari Jayanna (చర్చ) 16:50, 28 ఫిబ్రవరి 2015 (UTC)
మీరు చేసిన సుళువుబళువులు ప్రయత్నించి చూస్తాను. సాంకేతికంగా అత్యంత ప్రారంభదశలో ఉన్న వికీవ్యాఖ్యను అభివృద్ధి చేసి సభ్యులు సౌకర్యంగా పనిచేసుకోగలిగేందుకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 17:20, 3 మార్చి 2015 (UTC)
వైజాసత్య గారికి, విలీనం మరియు వికీకరణ మూసలు మనకు ఇక్కడ అవసరం పడుతున్నాయి. కాబట్టి వాటిని తయారుచేయాల్సి వున్నది.--Rajasekhar1961 (చర్చ) 10:48, 10 మార్చి 2015 (UTC)

దిగుమతులు చేసుకునే సౌకర్యం సచేతనం చేయండి (Request to enable transwiki import)[మార్చు]

I would like request enabling transwiki import on this wiki, so that we can import necessary templates from Telugu Wikipedia and English wikiquote. Please support me with this feature request.

మిత్రులారా, నేను ఈ వికీలో పేజీలను దిగుమతి చేసుకొనే సౌకర్యాన్ని సచేతనం చేయమని కోరుతున్నాను. దీన్ని వళ్ళ మనకు కావలసిన మూసలను ఇతర వికీలనుండి సులభంగా దించుకోవచ్చు. దయచేసి నా అభ్యర్ధనకు మద్దతివ్వండి --వైజాసత్య (చర్చ) 12:25, 4 మార్చి 2015 (UTC)

Support (మద్దతు)
Oppose (వ్యతిరేకత)
Neutral (తటస్థం)

వికీవ్యాఖ్య పరిధిపై ఫేస్ బుక్లో చర్చలు[మార్చు]

తెలుగు వికీవ్యాఖ్యలో తంత్రశాస్త్రానికి సంబంధించిన సంస్కృత శ్లోకాలు చేర్చే పనిచేయవచ్చా? అని మన వికీపీడియన్ వీరా గారు ధర్మసందేహం అడిగారు. దానికి సమాధానంగా చాలా చర్చే నడుస్తోంది. ఈ సందర్భంగా వికీవ్యాఖ్యాసేకర్తలు(అనొచ్చా? :-)) ఆంగ్లంలోని వికీవ్యాఖ్య పరిధిని, విస్తృతిని చర్చించే పలు వికీవ్యాఖ్య పేరుబరి వ్యాసాలను అనువదించుకుంటే బావుంటుంది. దాన్ని ఒక మూసగా తీసుకుని తెలుగు వికీవ్యాఖ్యకు సరిపడని అంశాలు తీసేస్తే బావుంటుంది. సముదాయం పిల్లకాల్వలా ఉన్న ఇప్పుడు ఇలాంటి పాలసీ అంశాలపై చర్చలు పెట్టుకుంటే అభివృద్ధి కష్టమని చాలామందే చెప్తూంటారు. కాకుంటే కనీసం కచ్చాగానైనా పరిధిని నిర్దేశించకుంటే ఔత్సాహికులను గందరగోళానికి గురయి అసలే పనిచెయ్యకుంటారేమోనని నా అనుమానం. ఏమంటారు అంతా? --పవన్ సంతోష్ (చర్చ) 03:37, 7 మార్చి 2015 (UTC)

వాడుకరి:Pavan santhosh.s బ్రో,
 • నా యూజర్ ఐడి రెడ్ గా ఉన్నదేమిటి?
 • ధర్మసందేహం ని బోల్డ్ చేశావేమిటి? (సెటైరా? :P)
 • నా అశ్వాలేవి?
 • నా సైన్యము ఎటు పోయినది?
(కామిడీ చేశా!) మనం డౌట్లు ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ డౌట్లు పెరుగుతూనే ఉంటాయి. (మా మేనత్తగారు ఒకరు ధర్మ సందేహాలు మరియు దాన్ని పోలిన ప్రోగ్రాం లు బ్యాన్ చేశారు. ఉన్న డౌట్లతో ఛస్తుంటే కొత్త డౌట్లు సృష్టిస్తున్నారని. నాస్తిక ముండా వాడిని కదా!! సంతోషించా!!!) కాబట్టి, సేఫ్ ప్లే గా వికీ కోట్ లో కొన్ని కొటేషన్స్ తో మొదలెట్టా. వికీ సోర్స్ లో కూడా కొని శ్లోకాలతో స్టార్ట్ చేశా. మొదలెడితే గానీ దారి పడదని నా ఉద్దేశ్యం. ఇంకా కలెక్షన్ పూర్తవ్వలేదు. కొద్దిగా టైం పడుతుంది. పూర్తవ్వగానే, ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా... వాడతా, అలా ఇలా కాదు, అసలు వాడకం అంటే ఏంటో చూపిస్తా!!! - Veera.sj (చర్చ) 05:43, 7 మార్చి 2015 (UTC)

@Veera.sj, అయ్యా శశిధర్ బాగున్నావా? చాన్నాళ్లయింది మిమ్మల్ని ఇక్కడ చూడక. యధాతధంగా శ్లోకాలు చేర్చేట్టయితే వీకీసోర్సే సరైన ప్రదేశం అనుకుంటా. @పవన్ సంతోష్ , చక్కని అలోచన. తప్పకుండా అవసరమైన ఆంగ్లపాలసీ పేజీలు ఇక్కడ అంటించి అనువదించగలరు --వైజాసత్య (చర్చ) 06:12, 11 మార్చి 2015 (UTC)

వీరన్నా తెలుగు వాడితే ఇలాగే తేడా కొడుతుంది. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. కామెడీ ఏంటంటే అదెప్పుడో మార్చి నాటిది ఇన్నాళ్ళకి వికీకోట్ కి వచ్చి చూశాను. ఎందుకు ధర్మసందేహం బోల్డ్ చేశానో మర్చేపోయాను. సర్లెండి. హాస్యం మాత్రం కాదని చెప్పగలను. కాన్సెప్టు మర్చిపోగలం గానీ ఫీలింగ్ అలా మర్చిపోలేం కదా.(ఇదీ కొటేషన్లానే లేదూ. అంతా వికీకోట్ మహిమ) --పవన్ సంతోష్ (చర్చ) 16:02, 18 ఏప్రిల్ 2015 (UTC)

తెలుగు సినిమాలు[మార్చు]

తెలుగు సినిమాలలోని మాటలు మరియు పాటలు ఇందులో చేరుస్తున్నాము. కానీ సినిమాలు ఒక్కొక్క దానికి పేజీలు తయారుచేయడం అవసరమా. ఇంతకుముందు కొంతమంది వికీపీడియాలోని ఆ సినిమా వ్యాసానికి లింకు ఇచ్చారు. అలా చేద్దామా. ఒకసారి సభ్యులు చర్చించిన పిదప ఆ పద్ధతి తెలుగు వికీఖోట్ లో పాటిద్దాము.--Rajasekhar1961 (చర్చ) 06:08, 10 మార్చి 2015 (UTC)

ట్రైన్ ద ట్రైనర్ (టీటీటీ) 2018[మార్చు]

అందరికీ నమస్కారం, సీఐఎస్‌-ఎ2కె నిర్వహణలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ (టీటీటీ) 2018 కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో 2018 జనవరి 26-28 తేదీల్లో జరగనుంది.

టీటీటీ అంటే ఏమిటి?

ట్రైన్‌-ద-ట్రైనర్‌ లేక టీటీటీ అన్నది రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం. ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయం సభ్యుల్లో (ఆంగ్ల వికీపీడియా సహా) నాయకత్వ నైపుణ్య అభివృద్ధి చేయడాన్ని లక్ష్యం చేసుకుని రూపకల్పన చేసినది. గతంలో టీటీటీ 2013, 2015, 2016, 2017ల్లో నిర్వహించాము.

ఎవరు చేరవచ్చు?

కార్యశాలలు, GLAM, ఎడిటథాన్‌లు, ఫోటోవాక్‌లు తదితర ఆఫ్‌-వికీ మరియు ఆన్‌లైన్‌ వికీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆసక్తి కల వాడుకరులు.
ఏ భారతీయ భాషా (ఇండిక్ లాంగ్వేజ్‌) వికీమీడియా ప్రాజెక్టులోనైనా కృషిచేస్తున్న చురుకైన వికీపీడియన్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
దరఖాస్తు చేసుకునే వాడుకరికి 2017 నవంబరు 1 నాటికి 500కు పైగా గ్లోబల్ ఎడిట్లు ఉండాలి.
గతంలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

సముదాయం నుంచి అర్హత కలిగిన వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించమని, అర్హులైన వికీపీడియన్లు పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నాం. ఇతర వివరాల కొరకు దయచేసి మెటా-వికీలో ఈ పేజీని చూడగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:33, 1 డిసెంబరు 2017 (UTC)