Jump to content

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

వికీవ్యాఖ్య నుండి
ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్, 1947

ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.

అల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.
రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు
  • మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
  • ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
  • రోజువారీ ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం.
  • ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
  • వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు. కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
  • నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.
  • ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.
  • రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.
  • సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.
  • విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.
  • మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
  • నా జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.
  • జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతునే ఉండాలి.
  • బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.
  • చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.
  • తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.
  • ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.
  • జ్ఞానికన్నా ఊహ గొప్పది.
  • నాకు గణితం మీద నమ్మకం లేదు.
  • జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.
  • తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.
  • స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.
  • నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా స్వీకరించాను.
  • భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.
  • ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని మనిషి ఆత్మలోని పాపాన్ని మాత్రం మార్చలేము.
  • ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.
  • నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.
  • అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి ఎక్కువ హానికరం,అగౌరవం.
  • శాస్త్ర విజ్ఞానమంతా ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.
  • దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు.
  • గొప్ప వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.
  • ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి. సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.
  • మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది.
  • మనం ఎంచేస్తున్నమో మనకి తెలిస్తే అది పరిశోధన కాదు. అవుతుందా?

మూలాలు

[మార్చు]

[1]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.