కార్ల్ మార్క్స్
Appearance
కార్ల్ మార్క్స్ Karl marx జర్మనీకి చెందిన తత్వవేత్త, రాజకీత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు చరిత్రకారుడు. ఇతడు 1818 మే 5 న జన్మించాడు. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ప్రముఖ గ్రంథాన్ని రచించాడు. 1883 మార్చి 14న మరణించాడు.
- కార్ల్ మార్క్స్ యొక్క ముఖ్య కొటేషన్లు
- మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే కాని రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు కావు.
- ఏ సిద్ధాంతమైనా ప్రజాస్వామ్యంపై పట్టు సంపాదించితే అది శక్తివంతంగా మారుతుంది.
- ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం.
- తాత్త్విక పరిశీలనకు ప్రాథమికావసరం నిర్భయమైన స్వతంత్రబుద్ధి.
- శాస్త్రజ్ఞానం స్వార్థపూరితభోగం కారాదు.
- గతి తర్కం అంటే బాహ్య ప్రపంచం, మానవుని ఆలోచన వీటి చలనానికి సంబంధించిన సాధారణ సూత్రాల విజ్ఞానమే.
- గతి తర్కం దేనినీ పూజాపీఠంపై నిల్పదు. అది స్వభావరీత్యానే విమర్శనా దృష్టిగలది.
- పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.