నవజ్యోత్ సింగ్ సిద్ధూ
స్వరూపం
నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1963 అక్టోబరు 20న జన్మించిన భారత క్రికెట్ క్రీడాకారుడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్వేర్ లాంటిది.[1]
- ఆకాశంలో బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుందంటే విమానంలోని ఎయిర్ హోస్టెస్ దాన్ని పట్టుకోవచ్చు.
- ఆ ఫీల్డర్ తన కాళ్ళను ఎంత వెడల్పు చేశాడంటే ఆ కాళ్ళ మధ్య నుంచి మారుతి కారు దూసుకెళ్ళగలదు.
- మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.
- సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది.
- చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి.
- సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే.
- మనవాళ్ళు కివీస్ (న్యూజీలాండ్) వాళ్ళను చితకబాదుతున్నారు. పాపం రెక్కలులేని పక్షులు కివీలే కదా!
- ఐపీఎల్ ఒక రాక్ మ్యూజిక్ లాంటిది.
మూలాలు
[మార్చు]- ↑ http://www.khaleejtimes.com/DisplayArticleNew.asp?section=sports&xfile=data/sports/2006/July/sports_July629.xml "Twenty20 game is 'underwear' cricket: Sidhu" in Khaleej Times (19 July 2006)