ఎంకి పాటలు
స్వరూపం
నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలు నుండి
[మార్చు]- గుండె గొంతుకలోన కొట్లాడుతాది
- రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల!
|నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి! కనుబొమ్మ సూడాలి! కరిగిపోవలి!
నన్ను కలలో సూసి నవ్వుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కరువు దీరాలి!
నిదరలో సిగపూలు సదురుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కమ్మగుండాలి!
పిలుపేదొ యినగానె తెలివి రావాలి! కనుబొమ్మ సూడాలి! కతలు తెలియాలి
గ్రంధాలయ సర్వస్వము - సంపుటము 5 సంచిక 1 (వికీసోర్సు) నుండి.
- జాము రేతిరి యేళ జడుపు గిడుపూ లేక '
- సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే
- సల్లగ వస్తాది నాయెంకి,
- మెల్లంగ వస్తాది నాయెంకి|
- పచ్చన్ని సేలోకి, పఁడు యెన్నెల్లోన
- నీలి సీరా గట్టి నీటు గొస్తావుంటే
- వొయ్యారి లాగుడు నాయె౦కి
- వొనలచ్చుమనిపించు నాయె౦కీ!
- యె౦కి వోస్తాదాని యెదురూగ నేబోయి
- గట్టుమీదా దాని కంటి కాపడగానె
- కాలు కదపాలేదు నాయె౦కీ!
- కరీగీ నీరౌతాది నాయె౦కీ!
- మాటలన్నీ సెప్పి మంచ౦కిందా కెల్లి
- గోనె పట్టా యేసి గొంగళి పైనేసి
- కూలాస గు౦టాది నాయె౦కి.
- కులుకు సూపెడతాది నాయె౦కి.
- యేతామెత్తేకాడ ఎదురుగా కూకుండి
- మల్లీ యెప్పటల్లె తెల్లార మోతుంటే
- శే౦దురుణ్ణి దిట్టు నాయె౦కి
- సూరియణ్ణి దిట్టు నాయె౦కి
న౦డూరి వే౦కట నుబ్బారావు