ఒటో వాన్ బిస్మార్క్
స్వరూపం
ఒటో వాన్ బిస్మార్క్ (1 ఏప్రిల్ 1815 – 30 జూలై 1898), జర్మన్ రాజకీయనేత, రాజనీతివేత్త; ఆయన ప్రష్యా ప్రధానమంత్రిగా(1862–1890), జర్మనీ తొలి ఛాన్సలర్‌గా(1871–1890). యూరప్ ఉక్కుమనిషిగా, ఐరన్ ఛాన్సలర్ గా పేరొందారు.
వ్యాఖ్యలు
[మార్చు]- జింకల కోసం నేను ఎర వేసినప్పుడు, దాన్ని వాసన చూసేందుకు వచ్చిన మొట్టమొదటి లేడిని నేను చంపను. మంద మొత్తం అక్కడికి వచ్చేదాకా ఆగుతాను.
- రాజకీయాలంటే అవకాశాల కళ.
- సెయింట్ పీటర్స్బర్గిస్క్ జైటంగ్కి చెందిన ఫ్రెడరిక్ మేయర్ వాన్ వాల్డెక్ ముఖాముఖీ (11 ఆగస్టు 1867)
- వాళ్ళు నన్నొక జిత్తులమారి నక్కలా, మోసగాళ్ళలోకెల్లా మొదటిరకంలా భావిస్తారు. కానీ నిజమేంటంటే, నేను పెద్దమనిషితో పెద్దమనిషిన్నరగా వుంటాను, ఓ సముద్రపు దొంగతో వ్యవహరించాల్సివస్తే సముద్రపు దొంగన్నరగా వ్యవహరిస్తాను.
- ఆక్రమించుకోవడానికి సరిహద్దులోకి వచ్చిన సైన్యం వాగ్ధాటి వల్ల ఆగదు.
- ఉత్తర జర్మన్ రీచ్‌స్టాగ్‌కు ప్రసంగం (24 సెప్టెంబరు 1867)