గంగాపురం హనుమచ్ఛర్మ
స్వరూపం
గంగాపురం హనుమచ్ఛర్మ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. దుందుభీ నది మీద గొప్ప గేయ కావ్యం రాసి, ప్రసిద్ధి చెందాడు.
శర్మ వ్యాఖ్యలు
[మార్చు]- పాలమూరు కూలీల గురించి
- తమ రెక్కలు డొక్కలు క్రుంగిపోవగా దేబెలుగాక యుండి, తమ దేశముకై తనువొంచు పాలమూరు లేబరు మించు వారలిల లేరు[1].
- సురవరం ప్రతాపరెడ్డి గురించి
- ఉరుము నిజాం గద్దెపయి నుల్కిపడంగను, వ్రాత వ్రాయు మా సురవర వంశ సంభవుడు[2].
- దుందుభీ నది గురించి
చరియ సంధుల బుట్టి
చారలై కనుపట్టి
చీమ యూటగా మారి
చెలగి ధారల బారి
వడిగొనుచు గుమిగూడి
వాః ప్రవాహమ్ములై,
నురుగులై తరగలై
నునులేత మెరుగులౌ
పావనానంతగిరి ప్రకృతిసీమల నుండి
స్వాధు పానీయ సంపదలతో బొదలుచును
ప్రవహింతువా దుందుభీ మా సీమ
ప్రవహింతువా
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, (పాలమూరు మహా మండల ప్రశస్తి-గంగాపురం హనుమచ్ఛర్మ), సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట-1
- ↑ మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం,(పాలమూరు మహామండల ప్రశస్తి-గంగాపురం హనుమచ్చర్మ), సంపాదకులు:బి.ఎన్.శాస్త్రి, మూసీ ప్రచురణలు,హైదరాబాద్,1993,పుట-1
- ↑ నవ వసంతం-3, తెలుగువాచకం, 8 వ తరగతి,(దుందుభీ-గంగాపురం హనుమచ్ఛర్మ),ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013,పుట-1