విద్య
Wikiquote నుండి
(చదువు నుండి మళ్ళించబడింది)
విద్య అనగా జ్ఞానం సముపార్జించడం. పూర్వకాలంలో విద్యార్థులు గురువుల వద్ద ఉండి వారికి సేవ చేస్తూ విద్యను పొందేవారు. కాలక్రమేణా విద్య యొక్క స్వరూపం మరియు అర్థం మారిపోయింది. ఇది చదువుకు పర్యాయపదంగా మారింది.
- విద్యపై ఉన్న కొటేషన్లు
- వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య. --స్వామి వివేకానంద
- ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. --స్వామి వివేకానంద
- విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా. --మహాత్మా గాంధీ
- మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది. --మహాత్మా గాంధీ
- విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం. --ప్లేటో
- విద్యపై ఉన్న సామెతలు
- అభ్యాసము కూసు విద్య
- చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
- చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు