Jump to content

నరేంద్రమోడి

వికీవ్యాఖ్య నుండి
(నరేంద్ర మోడి నుండి మళ్ళించబడింది)
పరిపూర్ణత అనేది నమ్మకంతోనో, వ్యక్తిగత విశ్వాసాలతోనో వచ్చేది కాదు. నిస్వార్ధంగా కష్టపడటం, ఒళ్లు దాచుకోక శ్రమించడం ద్వారానే అది సాధ్యమవుతుంది--మోదీ

నరేంద్ర మోదీ గుజరాత్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తిత గుజరాత్ ముఖ్యమంత్రి. 1950 సెప్టెంబర్ 17న జన్మించినాడు.

నరేంద్ర మోదీ యొక్క వ్యాఖ్యలు

[మార్చు]
  • తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని క్షమాపణలు చెప్పను[1]
  • నాపై రాళ్ళు విసిరితే ఆ రాళ్ళనే మెట్లుగా మార్చుకుంటా[2]
  • ఈ కోతి, ఎలుకకు ఆరుకోట్ల గుజరాత్ ప్రజలే శ్రీరాముడు, గణేశుడు (తనపై చేసిన విమర్శలకు మోదీ సమాధానం)[3]
  • ప్రధానిగా రాత్రి కాపలాదారుని పెట్టారు (మన్‌మోహన్ సింగ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య)[4]
  • అధికరణం-370 కాశ్మీర్‌కు మేలేనా? [5]
  • దేశాన్ని అమ్మితే తప్పు కాని, చాయ్ అమ్మితే తప్పేమి?
  • సత్యం,స్వచ్చత,స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు..తమను ప్రపంచమంత వ్యతిరేకించినా భయపడాలిసిన అవసరం లేదు.[6]
  • మహిళాభ్యుదయానికి కృషి చేయకుండానే దేశాన్ని, ప్రపంచాన్ని బాగుపర్చడం అనేది అసాధ్యమైన పని,ఏ మాత్రం అవకాశం లేని పని.
  • ఉల్లాసంగా ఉండే మెదడు ఒక విషయంపై స్థిరమైన అభిప్రాయానికి రావడానికి సాయపడుతుంది.తెలివి తేటలున్నప్పటికీ కొన్ని బంధనాల మధ్య కట్టడి చేసుకొన్న మెదడు వేయి రకాల డిఫికల్టిస్ ను సృష్టిస్తుంది.
  • విశ్వం,దేవుడు....రెండూ వేరు వేరు కాదు.ప్రపంచమే ఒక భగవత్స్వరూపం.సృష్టికారుడి మాయ. ఆ అద్భుత స్వరూపాన్నే మనం ప్రపంచంగా పిలుచుకొంటున్నాం

నరేంద్ర మోదీపై ఇతరులు చేసిన వ్యాఖ్యలు

[మార్చు]
  • నరేంద్ర మోదీ... ఓ పులి -- విజయ్ దర్దా (కాంగ్రెస్ ఎంపీ)[7]
  • అర్జునుడిలాంటి చూపు నరేంద్ర మోదీకి ఉంది-- అనిల్ అంబాని[8]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.


మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక 27-07-2012
  2. ఈనాడు దినపత్రిక 21-12-2012
  3. ఈనాడు దినపత్రిక 21-12-2012
  4. ఈనాడు దినపత్రిక తేది 04-03-2013
  5. ఈనాడు దినపత్రిక తేది 02-12-2013
  6. http://teluguquotations.blogspot.in/
  7. ఆంధ్రజ్యోతి దినపత్రిక 30-07-2012
  8. ఈనాడు దినపత్రిక తేది 12-01-2013