బెంజమిన్ ఫ్రాంక్లిన్
స్వరూపం
బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త. ఇతను జనవరి 17, 1706లో జన్మించాడు. ఏప్రిల్ 17, 1790న మరణించాడు.
వ్యాఖ్యలు
[మార్చు]- సహనం కలవాడు ఏదైనా సాధించగలడు.
- మంచి యుద్ధం, చెడ్డ శాంతి అనేది ఎప్పుడూ ఉండదు.
- మరణానంతరం కూడా గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
- ఖాళీ సమయం కావాలనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.
- కారణం లేకుండా ఎవరికి కోపం రాదు. అయితే ఎప్పుడో గాని సరైన కారణం ఉండదు.
- తృప్తి పేదవాడ్ని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి గొప్పవాణ్ణి పేదవాడిగా మారుస్తుంది.
- కోపంతో మొదలుపెట్టిన పని తప్పనిసరిగా అవమానాల పాలౌతుంది.
- జ్ఞానంపై పెట్టిన పెట్టుబడి ఉత్తమమైన వడ్డీని చెల్లిస్తుంది
- రాజ్యాంగం మనకు ఆనందాన్ని అన్వేషించుకునే హక్కును మాత్రమే ఇస్తుంది. ఆనందాన్ని వెతుక్కోవలసింది మాత్రం స్వయంగా మనమే. [1]
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ↑ ఈనాడు.2024-11-26.