Jump to content

అంబేద్కర్

వికీవ్యాఖ్య నుండి
నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు--అంబేద్కర్

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఏప్రిల్ 14, 1891న జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, డిసెంబర్ 6, 1956న మరణించాడు.

అంబేద్కర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు

[మార్చు]
  • మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం
  • గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.
  • జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య.
  • కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.
  • నా దేశ సమస్యలకూ, నా జాతి సమస్యలకూ మధ్య సంఘర్షణ వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యం ఇస్తాను.నేనూ,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది.
  • సామాజిక స్వేచ్ఛను సాదించకపోయి చట్టానిచ్చిన ఏ స్వాతంత్ర్యనైనా ప్రయోజనం లేదు.
  • నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
  • పుస్తకాలు దీపాలవంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది.
  • మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలమూ తిరిగిరాదు.
  • మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం. రెండూ తప్పే.
  • మూడ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు. సమాజం చైతన్యవంతం కావాలంటే, కాలానుగుణంగా సాగిపోవాలి.
  • ప్రతి స్త్రీని,ప్రతి పురుషుని శాస్త్ర దాస్యం నుంచి విముక్తుల్ని చేయండి.
  • మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు.
  • కౄరత్వం కంటే నీచత్వమే హీనమైనది.
  • కులం పునాదుల మీద మీరు దేనిని సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు.
  • దేశానికి గానీ,జాతికి గానీ సంఖ్యాబలమొక్కటే చాలదు.వారు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
  • కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది.
  • న్యాయం లేని సమాజం జంతుశాలే తప్ప మానవ సమాజం కాదు."
  • ఇతరుల విలువను అర్థం చేసుకునే ముఖ్యం
  • మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యంగా ఉండాలి.
  • దేశం అభివృద్ది చెందడమంటె. అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది.
  • ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
  • ఒక గుడి కడితే వెయ్యి మంది బిక్షగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారు.
  • వినయం, శీలం లేని విద్యావంతుడు, పశువు కంటే ప్రమాదకరం.
  • దేశానికి గానీ, జాతికి గానీ సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
  • వివేకం లేకుండా స్వేచ్ఛ ప్రమాదకరం. స్వేచ్ఛ లేకుండా వివేకం ఉల్లంఘన

జీవితానికి ఉపయోగపడే.. అంభేడ్కర్ చెప్పిన గొప్ప మాటలివి

"https://te.wikiquote.org/w/index.php?title=అంబేద్కర్&oldid=25243" నుండి వెలికితీశారు