అనుష్క శర్మ
స్వరూపం
అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.
ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- నా అతి పెద్ద భయం "భయమే". నేను అనుకున్నది చేయడానికి నేను ఎప్పుడూ భయపడను.
- నా జీవితాన్ని నియంత్రించే అధికారం నేను ఎవరికీ ఇవ్వను.
- చెడ్డ సినిమాలో నటించడం కంటే ఆరు నెలలు గదిలోనే ఉండిపోవడానికే ఇష్టపడతాను.
- నటి గా బయోపిక్ చేయాలనుకుంటున్నాను. ఇదొక థ్రిల్... నేను బయోపిక్ చెయ్యడానికి ఇష్టపడతాను.[2]
- నేను నిజాయితీ గల వ్యక్తిని , ఇతరుల షరతులతో నా జీవితాన్ని గడపను.
- నాకు ఎటువంటి సంకోచం లేదు, కాబట్టి నేను నా జీవితాన్ని చాలా నిజాయితీతో గడపగలుగుతున్నాను.[3]
- మీరు నన్ను ఎలా చూస్తున్నారో నేను అలాగే ఉన్నాను.[4]
- కాఫీ నాకు స్ట్రెస్ బస్టర్, నా రోజును ప్రారంభించడానికి నాకు ఉదయం కప్పు కాఫీ అవసరం.
- నన్ను నేను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటాను. కెమెరా ముందు మాత్రమే నాకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
- ఒక సైనికుడి కుమార్తెగా, వారు చేస్తున్నది నిజమైన డీల్ అని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఈ విషయంపై నేను స్టేట్మెంట్ ఇవ్వడంలో అర్థం లేదు.