అబ్రహం లింకన్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
అబ్రహం లింకన్

అబ్రహం లింకన్ (Abraham Lincoln) అమెరికా దేశానికి చెందిన 16వ అద్యక్షుడు. లింకన్ 1809 ఫిబ్రవరి 12న జన్మించాడు. 1865 ఏప్రిల్ 15న మరణించాడు.

అబ్రహం లింకన్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు[మార్చు]

  • ప్రజాస్వామ్యమంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ.
  • నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
  • మీరు ప్రజలందరినీ కొంతకాలం మోసగించవచ్చు. అయితే ప్రజలందరినీ అన్ని కాలాలలోనూ మోసం చెయ్యలేరు.
  • బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది.
  • ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
  • ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి.
  • శ్రమశక్తే పెట్టుబడికి మూలం.
  • డబ్బుపోతే పర్వాలేదు. ఆరోగ్యంపోతే ఇబ్బంది. కానీ నైతికవిలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
  • వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు.
  • పిలవని పేరంటానికి వెళ్ళేవారు అందరూ దయ్యాలే
  • హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది.
  • పని కోసం ఎదురుచూడటం ఓ అరుదైన యోగ్యత. దానిని ప్రోత్సహించాలి.
  • డబ్బు పోతే ఫర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
  • నీ ముత్తాతలు ఏమి సాధించరనేది అప్రస్తుతం, ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది.
  • వేచి వుంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే.
  • సంపద రెక్కలు వచ్చి ఎగిరి పోవచ్చు. కలకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే.
  • పొదుపును ప్రోత్సహించనిదే ఐశ్వర్యం రాదు.
  • అభినందనను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.
  • విద్య లేని ప్రజాస్వామ్యం, మితం లేని వంచన.
  • తన దేశాన్ని చూసి గర్వించే మనిషి అంటే ఎవరైనా ఇష్టపడతారు.
  • శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచములో ఎంతో ఉన్నత మైనది. దానిని జయించే శక్తి వేరే శక్తికి లేదు.
  • క్రిందవైపు చూసే ఒకడు నాస్తికం గురించి మాట్లాడొచ్చు. పై వైపు చూసే ఒకడు దేవుడు లేడని చెప్పడు.
  • నేను ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇంకా పొందేందుకు నమ్మకం కలిగి ఉండడానికి , నేను నా దైవపూర్వకమైన తల్లికి ఎంతో ఋణపడి ఉన్నాను.
  • నాయకుడనే వాడు ప్రశంసలను నలుగురిలోనూ, విమర్శలను ఏకాంతంలోను తెలియచేయాలి.
  • ప్రతి సామాన్యుడికి ఒక రోజు వస్తుంది. ఐతే ఆ సమయం వచ్చే వరకూ మౌనంగా ఎదురుచూడాలి.
  • ప్రేమించగల మనిషికే విమర్శించే హక్కు ఉంటుంది.
  • నేను బానిసగా ఉండేందుకు ఇష్టపడను.అలాగే యజమానిగా కూడా
  • తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా జీవించే మనిషంటే మరీ ఇష్టం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.