అబ్రహం లింకన్
Appearance
(అబ్రహాం లింకన్ నుండి మళ్ళించబడింది)
అబ్రహం లింకన్ (Abraham Lincoln) అమెరికా దేశానికి చెందిన 16వ అద్యక్షుడు. లింకన్ 1809 ఫిబ్రవరి 12న జన్మించాడు. 1865 ఏప్రిల్ 15న మరణించాడు.
అబ్రహం లింకన్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు
[మార్చు]- ప్రజాస్వామ్యమంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ.
- నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
- మీరు ప్రజలందరినీ కొంతకాలం మోసగించవచ్చు. అయితే ప్రజలందరినీ అన్ని కాలాలలోనూ మోసం చెయ్యలేరు.
- బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది.
- ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
- ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి.
- శ్రమశక్తే పెట్టుబడికి మూలం.
- డబ్బుపోతే పర్వాలేదు. ఆరోగ్యంపోతే ఇబ్బంది. కానీ నైతికవిలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
- వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు.
- పిలవని పేరంటానికి వెళ్ళేవారు అందరూ దయ్యాలే
- హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది.
- పని కోసం ఎదురుచూడటం ఓ అరుదైన యోగ్యత. దానిని ప్రోత్సహించాలి.
- డబ్బు పోతే ఫర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
- నీ ముత్తాతలు ఏమి సాధించరనేది అప్రస్తుతం, ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది.
- వేచి వుంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే.
- సంపద రెక్కలు వచ్చి ఎగిరి పోవచ్చు. కలకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే.
- పొదుపును ప్రోత్సహించనిదే ఐశ్వర్యం రాదు.
- అభినందనను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.
- విద్య లేని ప్రజాస్వామ్యం, మితం లేని వంచన.
- తన దేశాన్ని చూసి గర్వించే మనిషి అంటే ఎవరైనా ఇష్టపడతారు.
- శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచములో ఎంతో ఉన్నత మైనది. దానిని జయించే శక్తి వేరే శక్తికి లేదు.
- క్రిందవైపు చూసే ఒకడు నాస్తికం గురించి మాట్లాడొచ్చు. పై వైపు చూసే ఒకడు దేవుడు లేడని చెప్పడు.
- నేను ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇంకా పొందేందుకు నమ్మకం కలిగి ఉండడానికి , నేను నా దైవపూర్వకమైన తల్లికి ఎంతో ఋణపడి ఉన్నాను.
- నాయకుడనే వాడు ప్రశంసలను నలుగురిలోనూ, విమర్శలను ఏకాంతంలోను తెలియచేయాలి.
- ప్రతి సామాన్యుడికి ఒక రోజు వస్తుంది. ఐతే ఆ సమయం వచ్చే వరకూ మౌనంగా ఎదురుచూడాలి.
- ప్రేమించగల మనిషికే విమర్శించే హక్కు ఉంటుంది.
- నేను బానిసగా ఉండేందుకు ఇష్టపడను.అలాగే యజమానిగా కూడా
- తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా జీవించే మనిషంటే మరీ ఇష్టం.
- ప్రజలే పార్లమెంటుకు చట్టబద్ధ యజమానులు. అయితే వారికున్న ఆ అధినాయకత్వం రాజ్యాంగాన్ని తోసిరాజనడానికి కాదు. రాజ్యాంగాన్ని వక్రీకరించే నాయకులను పదవి నుంచి తొలగించడానికి.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు.2024-11-26