అరుణా సాయిరాం

వికీవ్యాఖ్య నుండి
అరుణ సాయిరాం

సంగీత కళానిధి అరుణా సాయిరాం ఒక భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసురాలు.[1] ఆమె భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కార గ్రహీత, భారత ప్రభుత్వంచే సంగీత నాటక అకాడమీ (సంగీత నృత్యాల భారతదేశ ప్రధాన జాతీయ సంస్థ)కు వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైంది. ఈమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగే "బి.బి.సి.ప్రొమ్స్"లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. అలాగే ఇజ్రాయేల్‌లో జరిగే "జెరూసలేం ఔద్ ఫెస్టివల్"‌లో పాల్గొన్న మొట్టమొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు కూడా. ఈమెకు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

వ్యాఖ్యలు[మార్చు]

 • ఎలాంటి అయోమయానికి గురికాకుండా భావవ్యక్తీకరణ చేయగలిగితే అది మంచి స్వరం అవుతుందని భావించాను . . . ప్రారంభంలో నన్ను నిరూపించుకోవాలనే బెంగ ఉండేది. ఇప్పుడు, సంవత్సరాల తర్వాత, నేను లేనిదాన్ని చూపించడానికి ప్రయత్నించడం లేదు. నేనేమైనా సరే - మంచి, చెడు, ఉదాసీనత, ఇది ఇదే నేను దానిని వినయంతో అందిస్తున్నాను.
 • బాగా కష్టపడు..! దయ ఉంటే తప్ప విజయం చేయి పట్టదు.[2]

టైమ్స్ అఫ్ ఇండియా[3]

 • ఎప్పుడు గుర్తుంచుకోండి. మీ కచేరీలు మూడు రకాల ప్రేక్షకులు వస్తారు. ఒకటి సంప్రదాయ సంగీతం లో పండితులు, లోతు తెలిసినవారు, మధ్య రకం వారు కొన్ని సాంకేతిక విషయాలు తెలిసినవారు, ఇంకా మూడో రకం కచేరీని ఆనందించుదామని వస్తారు. కాబట్టి వేదికమీద ఈ మూడు రకాల రసికులకు ఏమి చేయగలమో ఆలోచించండి. విషయం ఏదైనా కానీ వారి అభిప్రాయం తీసుకొండి. సాధారణంగా వారు మర్యాదగానే ఉంటారు. అవకాశం ఉంటే వారిని నిజాయతీగా అభిప్రాయం ఇమ్మని కోరండి. ఒకసారి ప్రేక్షకులను అభ్యర్థిస్తే మీరు అందరిచేత ప్రేమించబడతారు.
 • మీకు కచేరీ రేపు అనగా మిలియన్ సార్లు అభ్యాసం చేస్తారు. అదే మీరు పదే పదే చాలా సార్లు పాడుతుంటే, సాంకేతిక విషయాల ప్రాబల్యం తగ్గి పాటని హృదయం నుంచి పాడతారు.
 • నా గురువు బృందా అమ్మ సంప్రదాయవాది. ఆమె ఖచ్చితమైన వ్యక్తిగా పేరు పొందారు. నాకు 10 సంవత్సరాల వయసు లో ఆమె చెప్పేవారు ఏమంటే- సంగీతం నేర్చుకుంటున్నప్పుడు గాజాలా ఉండాలి అని, వేదికమీద ఉన్నప్పుడు రాజాలా ఉండాలి అని.
 • పరిపూర్ణత అనేది నిరంతర ప్రయాణం, కానీ నమ్మకంతో పాడటం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది.మీరెప్పుడు పరిపూర్ణత సాధించడం కోసం ప్రయత్నం చేయాలి, వేదిక మీద నమ్మకం పోగొట్టుకొకూడదు.
 • గాయనిగా నా ప్రయాణంలో, ఇజ్రాయెల్ మేధావి మోషే ఫెల్డెన్‌క్రైస్ వ్యాఖ్యను నేను తరచుగా గుర్తుచేసుకుంటాను: “మనం మన స్వీయ-చిత్రానికి అనుగుణంగా వ్యవహరిస్తాము. ఈ స్వీయ-చిత్రం - మన ప్రతి చర్యను నియంత్రిస్తుంది - వారసత్వం, విద్య, స్వీయ-విద్య అనే మూడు అంశాల ద్వారా వివిధ స్థాయిలలో నియంత్రించబడుతుంది. నేను చిన్నతనంలోనే నేర్చుకున్న విద్య గానం. పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్‌గా నా అన్వేషణలో వాయిస్ కల్చర్ శిక్షణ అనేది స్వీయ-విద్య. చిన్నతనంలో, నేను ప్రాథమిక వాయిస్ వ్యాయామాలు నేర్చుకున్నాను. [4]

అరుణా సాయిరాం గురించి[మార్చు]

 • లెజెండరీ ఎం.బాలమురళీకృష్ణ గారు తర్వాత, వినవలసిన కర్ణాటక గాయని ఎవరైనా ఉంటే, అది అరుణ సాయిరాం
  • కూచిపూడి నాట్య కోవిదుడు - రాజారెడ్డి. [5]
 • అరుణ ముక్త కంఠంతో గానం చేయడం, వేగం ఉన్నప్పటికీ అకారాలు, కరవైలపై ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ లక్షణాలు. ఆమె తన ప్రారంభ శిక్షణను దివంగత బృందా వద్ద జరిగింది. కానీ కాలక్రమేణా ఆమె పురుషుల, స్త్రీల మాస్ట్రోల శైలులను చాలామందివి గ్రహించింది. అరుణ బాణి అని పిలవబడే పరిశీలనాత్మక వ్యక్తీకరణను అభివృద్ధి చేసింది. ఆమె బ్రిఘాలు, ప్రత్యేకించి, GNBని ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ల ప్రవాహ తాన్‌లను గుర్తుచేస్తాయి. ఆమె గానం రసికులకు భక్తి భావాన్ని అందజేస్తాయి. ఆమె 1980ల చివరలో జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో ఒక శిక్షకుని నుండి వాయిస్ శిక్షణ పొందింది. అతను ఆమె స్వరాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసాడు, తద్వారా ఆమె దానిని మరింత మృదువుగా, వ్యక్తీకరణగా మార్చగలగింది.
 • ముఖ్యమైన లక్షణం భావోద్వేగం. రెండవది శక్తి. ఆ తర్వాత సాంకేతిక అంశాలు వస్తాయి, నేను అనుకుంటున్నాను." ఇవన్నీ కచేరీలో బాగా వచ్చాయి. ఆమె శ్వాస నియంత్రణ, స్పష్టంగా వాయిస్ శిక్షణ ఫలితంగా, విశేషమైనది
  • అరుంధతీ సుబ్రమణియన్‌ని ఒక ఇంటర్వ్యూలో ఆమె శైలి యొక్క విశిష్టత గురించి అడిగినప్పుడు, ఆమె ఇలా సమాధానమిచ్చింది:
 • గత శతాబ్దిలో కనీ వినీ ఎరుగని రీతిలో ఉదయం 4.30 గంటలకే అకాడమీలో అరుణ సాయంత్రం కచేరీకి టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు రసికలు క్యూ కట్టారు. టిక్కెట్లు పొందలేని వారు చాలా మంది ఉన్నందున, అకాడమీ 250 మంది కూర్చునే సామర్థ్యంతో దాని మినీ కచేరీ హాల్‌ను ప్రారంభించింది. అది కూడా అనతికాలంలోనే నిండిపోయింది.
  • కోల్‌కతాలోని ITCకి చెందిన సంగీత్ రీసెర్చ్ అకాడమీ (వెస్ట్రన్ రీజియన్) జనవరిలో ముంబైలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో, సంగీత అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళి, 2010 డిసెంబర్‌లో చెన్నైలో జరిగిన సంగీత ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన ఎపిసోడ్‌ని వివరించారు.[6]
 • ఆమె అభిరుచి, పరిశీలన తీవ్రత జాన్ కోల్ట్రేన్ చొచ్చుకొనిపోయే, అన్వేషణాత్మక మెరుగుదలలను గుర్తుచేస్తుంది
  • లాస్ ఏంజిల్స్ టైమ్స్, 2006
 • అరుణా సాయిరామ్ కర్నాటక గాత్ర సంగీతానికి ప్రియురాలు. ఆమె సంప్రదాయం నుండి BBC ప్రోమ్స్‌లో పాడిన మొట్టమొదటిది.
  • పల్స్, లూటన్, ఇంగ్లాండ్, 2011.
 • ఎంఎస్ సుబ్బులక్ష్మి ఇక లేరు. కానీ స్వర స్వచ్ఛత, డిక్షన్, నిష్కళంకమైన శృతి అమరిక మరియు చులకన లేని గానం వంటి వాటికి సరిపోయే గాయని ఎవరైనా ఉన్నారా, అది అరుణ సాయిరామ్”
  • ఔట్‌లుక్ మ్యాగజైన్, 2008

మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
 1. "The Hindu: Entertainment Delhi / Music : Song of the soul". Chennai, India: Hindu.com. 17 February 2006. Archived from the original on 13 సెప్టెంబరు 2006. Retrieved 30 September 2010.
 2. NewsBharati.30 January 2019. https://www.newsbharati.com/Encyc/2019/1/30/quote-30-1-2019.html
 3. Saranya,CR.My guru told me, be a gaaja when learning, a raaja on stage: Aruna Sairam. Times of India. 18 January 2020. https://timesofindia.indiatimes.com/entertainment/tamil/music/my-guru-told-me-be-a-gaaja-when-learning-a-raaja-on-stage-aruna-sairam/articleshow/73327265.cms
 4. What is the need for basic voice exercise? Leading vocalist Aruna Sairam elaborates on the significance of voice culture. The Hindu.14 June 2018.
 5. Suanshu Khurana. What makes Carnatic vocalist Aruna Sairam a legend.Indian Express.13 January 2023.https://indianexpress.com/article/lifestyle/art-and-culture/aruna-sairam-carnatic-vocalist-aruna-sairam-legend-8378439/
 6. A Seshan Performance par excellence.Nartaki: Gateway to the world of Dance. https://narthaki.com/info/rev10/rev857.html