Jump to content

ఆది శంకరాచార్యులు

వికీవ్యాఖ్య నుండి

శంకరాచార్యులుఆంగ్లం; Adi Shankara కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించాడు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త. శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.

శంకరాచార్యుని ముఖ్యమైన కొటేషన్లు

[మార్చు]
పుట్టడం,పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు
  • ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యంలోనే.
  • మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు.
  • పుట్టడం,పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు.
  • మహావాక్యాల సారమం పరమాత్మ.
  • బ్రహ్మ సత్యం జగత్తు మిధ్య.
  • గీతా శాస్త్రం సమస్త వేద వేదాంతాల సార సంగ్రహం.
  • మన మెదడు దేవుని కేంద్రబిందువు.
  • మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించలేవు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.