Jump to content

ఆరుద్ర

వికీవ్యాఖ్య నుండి

ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. జూన్‌ 4, 1989న ఆరుద్ర మరణించాడు.

మద్యలొని వ్యక్తి ఆరుద్ర


ఆరుద్ర ముఖ్యమైన వ్యాఖ్యలు

[మార్చు]
  • నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.
  • బ్రూటు వేసిన ఓటు బురదలో గిరవాటు, కడకు తెచ్చును చేటు.
  • కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి
  • కవిత కోసం నేను పుట్టాను-క్రాంతి కోసం కలం పట్టాను.
  • జాతికి జీవనాళిక జానపద గీతి
  • జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్,భార్య ఎర్త్.
  • తరానికో వందకవులు తయారవుతారెప్పుడూ. వందలోనూ, మందలోనూ మిగల గలిగేదొక్కడే.

సినిమా పాటలు

[మార్చు]
  • అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా - సాక్షి
  • ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే ఎడబాటు ఉండదు ఏనాటికీ - w:మనుషులు చేసిన దొంగలు
  • ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేకలు కురిపించెను ప్రేమలేఖలు - w:ప్రేమలేఖలు
  • ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము - w:ఇంటింటి రామాయణం
  • ఎవరేమన్నా తోడు రాకున్నా ఒంటరిగానే పోరా బాబూ - నీ దారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా - w:దొంగలకు దొంగ
  • కదలిరండి మనుషులైతే కదలిరండి మమత వుంటే ఉప్పెనగా ఉమ్మడిగా బలి కోరిన దీనుల కోసం బతకలేని చావలేని ప్రాణుల కోసం - w:ఊరికి మొనగాడు
  • రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా - w:గోరంత దీపం
  • విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట - w:మంచి మనుషులు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఆరుద్ర&oldid=15952" నుండి వెలికితీశారు