ఊరు
స్వరూపం
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు. తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అనే అంటారు.
సామెతలు
[మార్చు]- ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.
- ఊర్లో పెళ్ళికి ఇంట్లో సందడి
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
- ఊరి జబ్బు చాకలి యెరుగును, వుద్యోగపు జబ్బు బంట్రోతు యెరుగును.
- ఊరి ముందరికి వచ్చి నా పెండ్లామూ పిల్లలూ యెట్లా వున్నారని అడిగినాడట.
- ఊరు వున్నది, చిప్ప వున్నది.
- ఊరంతా చుట్టాలు ఉట్టికట్టటానికి తావులేదు
- ఊరంతా నాన్నకు వణికితే నాన్న అమ్మకు వణికినట్లు
- ఊరంతా వడ్లుయెండబెట్తుకుంటే నక్క తోక యెండబెట్టుకున్నదట
- ఊరికి ఉపకారంగా భార్యకు చీరకొనిపెడతాను ఇంటికి డబ్బుయివ్వండి అన్నాడాట