ఎడ్మండ్ హిల్లరీ
Appearance
సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, కె.జి, ఓ.ఎన్.జి, కె.బి.ఈ (జూలై 20, 1919 – జనవరి 11, 2008) న్యూజిలాండ్కు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు. 33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- మనం జయించేది పర్వతం కాదు, మనల్నే.
- ప్రజలు అసాధారణంగా మారాలని నిర్ణయించుకోరు. అసాధారణమైన పనులు సాధించాలని నిర్ణయించుకుంటారు.[2]
- జీవితం కాస్త పర్వతారోహణ లాంటిది - ఎప్పుడూ కిందకు చూడకండి.
- మంచి ప్లానింగ్ ముఖ్యం. ఒక పెద్ద యాత్రలో హాస్య చతురతను కూడా చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటిగా నేను భావించాను. మీరు క్లిష్టమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా విజయావకాశాల గురించి మీరు నిరాశకు గురైనప్పుడు, మిమ్మల్ని నవ్వించగల ఎవరైనా ఉద్రిక్తతను తగ్గిస్తారు.
- పర్వత శిఖరాన్ని అధిరోహించడం కంటే మానవ జీవితం చాలా ముఖ్యం.
- నేను అదృష్టవంతుడిని. నాకు ఒక కల వచ్చింది, అది నిజమైంది, ఇది పురుషులకు తరచుగా జరిగే విషయం కాదు.
- హిమాలయాలలో నా ప్రియమైన స్నేహితుల కోసం పాఠశాలలు, వైద్య క్లినిక్లను నిర్మించడం, నిర్వహించడం, వారి అందమైన మఠాలను పునరుద్ధరించడంలో సహాయపడటం నా ముఖ్యమైన ప్రాజెక్టులు.