Jump to content

ఎర్రజెండా

వికీవ్యాఖ్య నుండి

అంబర వీధుల మెరసింది కాంచన గంగా ధవళ శిఖరిపై రక్త దీధితులు విరిసాయి

అనల పతాకం అనల పతాకం అజన్ర మజన్ర మెగిరింది తారాగ్రహముల తరుణాంగణమున </poem> --W:పురిపండా అప్పలస్వామి[1]]] ఎర్రజెండా విప్లవానికి,పోరాటానికి, ప్రమాదానికి, కమ్యూనిజానికి ప్రతీక.

ఎర్రజెండాపై వ్యాఖ్యలు

[మార్చు]


త్యాగంతో తిరుగుబాటుతో
శిరమెత్తిన ఎర్రని జెండా
ముందు నిలిచి పిలుస్తుంది
భావి జయం సూచిస్తొంది.

--చైతన్యప్రసాద్[3]

మేడే వచ్చింది
ఎర్రని జెండా ఎగిరింది
కార్మికులంతా ఏకంకండని
కదనశంఖం ఊదింది.



అరుణోదయ కాంతులతో
అరుణ పతాకంబదిగదిగో
చేతపట్టి - జైకొట్టి
ఎత్తిన జెండా దించకు
ఎగురవేయ్ -గగనతలం
అదే మీకు ప్రగతిపథం
అదే మీకు బ్రహ్మరథం

ఎగిరే ఎర్రనిజెండా
నీడలోన పయనిద్దాం!
వికసించే నవలోకం
మనదేనని చాటేద్దాం!!

అడవి తల్లి అల్లాడీ
రగల్ కాంతులీనింది
ఆ రగల్ జండా బట్టినం
రణం బాట నడిసెదాం

బుద్దీ లేని పెద్ద మనుషులు
గద్దెల మీద కులుకాబట్రీ
పలకావేమి ఉలకావేమి
బండరాయిగా మారిన సామి
కూలోళ్ళంతా తిరగాబడ్తే
ఎర్రజెండా అండానుండు

--ప్రభు[8]


  • ఎర్రజెండ ఎర్రజెండెన్నియలో ఎర్రెర్రనిదీ జెండేన్నియలో[9]

మూలాలు

[మార్చు]
  1. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-59
  2. తెలుగు సాహిత్య దర్శనం,సం:ఎస్. నాగేంద్రనాథ్‌రావు,పల్లవి ప్రచురణలు, విజయవాడ,పుట-6
  3. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-109
  4. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-107
  5. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-129
  6. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-132
  7. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-223
  8. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-230
  9. w:ఆర్.నారాయణమూర్తి చిత్రంలో ఒక పాటలో...
"https://te.wikiquote.org/w/index.php?title=ఎర్రజెండా&oldid=16799" నుండి వెలికితీశారు