కన్ఫ్యూషియస్
స్వరూపం
కన్ఫ్యూషియస్ [Chinese: 孔夫子, లిప్యంతరీకరణ కాంగ్ ఫు జి or కుంగ్-ఫు-త్జు] (సంప్రదాయక మూలాలను అనుసరించి 28 సెప్టెంబర్ క్రీ.పూ.551 – క్రీ.పూ.479) చైనాకు చెందిన సామాజిక తత్త్వవేత్త, అతని బోధనలు తూర్పు ఆసియా జనజీవనాన్ని లోతుగా ప్రభావితం చేశాయి.
వ్యాఖ్యలు
[మార్చు]అనలెక్ట్స్
[మార్చు]మొదటి అధ్యాయం
[మార్చు]- నువ్వు నేర్చుకున్నదాన్ని అధ్యయనం చేసి, సాధన చేయడం ఒక ఆనందం కాదా? దూరప్రదేశాల నుంచి స్నేహితులు వచ్చి చూడడం ఆనందం కాదా? చుట్టూవున్న ప్రజలు తనను అర్థంచేసుకోకపోయినా ఒకరు అందుకు చిరాకుపడకుంటే అతను ఋషి కాడా?
- ఇది అధ్యాయంలోని మొదటి వాక్యం.
- నేను ఇతరులకు తెలియను అన్న విషయానికి ఇబ్బందిపడను. ఇతరులు నాకు తెలియకుంటే ఇబ్బందిపడతాను.
- నిజాయితీగా, నమ్మదగ్గ వ్యక్తిగా ఉండు. ఈ విషయంలో నీకన్నా కిందిస్థాయిలో ఉన్నందుకు ఎవరి స్నేహమూ వదులుకోవద్దు. తప్పుచేసినప్పుడు, సరిదిద్దుకునేందుకు భయపడకు.
- వెయ్యి రథాలున్న రాజ్యాన్ని పరిపాలించినప్పుడు (చిన్న నుంచి మధ్యతరహా రాజ్యం), నువ్వు వ్యాపారం పట్ల కచ్చితమైన శ్రద్ధ పెట్టాలి, మాట మీద నిలబడు, ఖర్చు విషయంలో పొదుపు పాటించు, అలానే ప్రజలను ప్రేమించు. వారి సేవలు ఋతువుల ప్రకారం వాడుకోవాలి (అంటే రైతుల సేవలను విత్తేప్పుడు, పంటకోతకు వచ్చినప్పుడు కోరకూడదు).
- ఉన్నతుడైన వ్యక్తి భోజనం చేసేప్పుడు ఎక్కువ తినేందుకు ప్రయత్నించడు; విశ్రాంతి సమయంలో పూర్తి సౌకర్యం కోరుకోడు; పనిలో కష్టపడతాడు, మాటలు జాగ్రత్తగా మాట్లాడతాడు. గొప్పవ్యక్తులకు సేవలందించి, తనను తాను సరిదిద్దుకుంటాడు. ఇలాంటి వ్యక్తిని మీరు, "అతను నేర్చుకోవడాన్ని ఇష్టపడతాడు" అనొచ్చు.
రెండవ అధ్యాయం
[మార్చు]- పదిహేనేళ్ళ వయసులో నా హృదయం నేర్చుకోవడంపై నిలిచిందిః; ముప్ఫైలో నేను స్థిరంగా నిలిచాను; నలభైల్లో నాకే అనుమానాలు మిగల్లేదు; యాభైఏళ్ళనాటికి స్వర్గం యొక్క ఆదేశం నాకు తెలుసు; అరవైల్లో నా చెవి ఆజ్ఞాబద్ధం అయింది; డెబ్భైల్లో నియమాతిక్రమణ చేయకుండానే నా హృదయాన్ని అనుసరించగలిగాను.
- తన జీవితంపై చేసిన పరిశీలన. ఈ వ్యాఖ్య జాతీయమై, మానవ జీవితంలోని దశాబ్దాలకు చైనీస్ భాషలో ఈ పదాలను అనుసరించి ప్రత్యామ్నాయ నామాలు ఏర్పడ్డాయి..
- నేర్చుకున్నదాన్ని సమీక్షించుకోవడం, కొత్తగా నేర్చుకోవడం-వీటి వల్ల నువ్వు గురువయ్యేందుకు సరిపోతావు.
- ఉన్నతుడైనవాడు అందరికీ ఆప్తుడై ఉండీ, పక్షపాతంతో వ్యవహరించడు. అధముడు పక్షపాతంతోనూ, అందరికీ ఆప్తుడు కాకుండాను ఉంటాడు.
- ఆలోచించకుండా అధ్యయనం చేయడం వ్యర్థం. అధ్యయనం చేయకుండా ఆలోచించడం ప్రమాదకరం.
మూడవ అధ్యాయం
[మార్చు]- ఒక మనిషికి మానవత్వం లేకుంటే అతని ఆస్తి ఎలావుంటుంది? ఒక మనిషికి మానవత్వం లేకుంటే అతని ఆనందం ఎలావుంటుంది?
- పేర్లు సరిగా లేకుంటే, భాష వస్తువల నిజస్థితికి సంబంధంలేకుండా ఉంటుంది.
- మరో చైనీస్ సామెత "వస్తువులను సరైన పేరుతో పిలవడం జ్ఞానానికి ఆరంభదశ" అన్నదానితో ఇది వివరించవచ్చు.
నాలుగవ అధ్యాయం
[మార్చు]- మానవత్వంతో ఉండడం మంచిది. మంచితనానికి చెందనిది ఎంచుకుని, మానవత్వనికి దూరమైతే, మనం జ్ఞానవంతులం ఎలా అవుతాం?
- అధ్యాయంలో మొదటి వ్యాఖ్య, చైనీస్ లో ఈ వ్యాఖ్య మీదుగానే అధ్యాయానికి పేరుపెట్టారు.
- సత్యపథం నాకు ఉదయం వినిపిస్తే, ఆ సాయంత్రం మరణించేందుకు కూడా తగినంత సంతృప్తితో ఉంటాను.
- విలువ ఇవ్వదగ్గ వ్యక్తిని చూసినప్పుడు, వారితో సమానం కావాలనుకోవాలి; అందుకు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తిని చూస్తే, మనలోకి మనం చూసుకుని మనల్ని మనం పరిశీలించుకోవాలి.
- నీ తండ్రి జీవించివున్నప్పుడు, అతని కోరికలు గమనించు. నీ తండ్రి మరణించినప్పుడు అతను గతంలో చేసిన చర్యలు పరిశీలించు. అతను మరణించి మూడేళ్ళు గడిచాకా కూడా నువ్వు నీ తండ్రి మార్గాన్ని విడిచిపెట్టలేదంటే, నిన్ను ఒక 'నిజమైన కొడుకు (గ్జియావో/హ్సియావో)' అని పిలవవచ్చు.
- జాగ్రత్తపరుడు అరుదుగా తప్పుచేస్తాడు.
- ఉన్నతమైన వ్యక్తి మాటల్లో అతిశయించడు, కానీ చేతల్లో వాటిని దాటతాడు.
- ధర్మాత్ముడైన మనిషి ఒంటరి కాడు. ధర్మాన్ని పాటించేవారికే పొరుగువారుంటారు.
- ఉన్నతుడైనవాడు ధర్మాన్ని(Righteousness) గురించి తెలుసుకుంటాడు, కానివాడు అవకాశాన్ని గురించే తెలుసుకుంటాడు.
- ధర్మాత్ముడైనవాడు బాధ్యతను అనుసరించి నడిస్తే, అధర్మపరుడు లాభాన్ని అనుసరించి వెళ్తాడు.
ఆరవ అధ్యాయం
[మార్చు]- సత్యాన్ని తెలిసినవారు, దాన్ని ప్రేమించేవారితో సమానం కాదు, దాన్ని ప్రేమించేవారు, దానిలో ఆనందించేవారితో సమానం కాదు.
- జ్ఞానులు నీటిలో సంతోషం వెతుక్కుంటారు; ధర్మపరులు కొండల్లో సంతోషం వెతుక్కుంటారు. జ్ఞానులు చురుకైనవారు; ధర్మాత్ములు ప్రశాంతమైనవారు. జ్ఞానంకలవారు సంతోషంగా ఉంటారు; ధర్మపరులు దీర్ఘకాలం జీవిస్తారు.
ఏడవ అధ్యాయం
[మార్చు]- ఇద్దరితో కలిసి నడుస్తున్నప్పుడు, కనీసం ఒక్కరినుంచైనా ఏదోకటి నేర్చుకోగలను.
- జ్ఞానం పొందాలన్న ఆసక్తిలేనివానికి సత్యాన్ని తెలపను, లేదా తనకు తాను వివరించుకునే ఆరాటం లేనివానికి సహాయం చేయను. ఎవరికైనా ఒక అంశంలో ఒక కోణం చూపిస్తే, అతను మిగిలిన మూడూ నేర్చుకోలేకపోతే, అతనికి నా పాఠం తిరిగిచెప్పను.
ఎనిమిదవ అధ్యాయం
[మార్చు]- ఒక రాజ్యంలో సుపరిపాలన ఉన్నప్పుడు, పేదరికం, మధ్యస్థ స్థితి సిగ్గుపడాల్సిన విషయాలు. ఒక దేశంలో పరిపాలన సరిగా లేనప్పుడు, సంపన్నంగా వుండడం, గౌరవం పొందడం సిగ్గుపడాల్సిన విషయాలు.
మిగిలిన అధ్యాయాలు
[మార్చు]- ధర్మంగా పరిపాలించేవాడు ఉత్తరధృవ నక్షత్రంతో పోల్చాల్సినవాడు, అన్ని నక్షత్రాలు దానిచుట్టూ తిరుగుతుండగా తన స్థానంలోనే నిలబడుతుంది.
- ఉన్నతుడైనవాడు సంతృప్తితో, సంతోషంగా ఉంటాడు; సగటుమనిషి ఎప్పుడూ బాధలతోనే జీవిస్తాడు.
- నిష్కపటమైనవాడు ధర్మాత్ముడు; రహస్యంగా జీవిస్తూ,బాధపడతున్నవాడు అధర్మపరుడు
- నీ తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు ఒక్కోసారి వారిని సరిదిద్దడంలో తప్పులేదు. కానీ వారు నీ మాట వినకుంటే, వారిపై గౌరవాన్ని నిలబెట్టుకుని, వారికి దూరం కాకుండా చూసుకో. ఫిర్యాదుల్లేకుండా పనిచేయి.
- యువకుడు ఇంట్లో తల్లిదండ్రులను సేవించాలి, బయట పెద్దలను గౌరవించాలి. అతను గంభీరంగా, నిజాయితీగా, అందరి పట్ల ప్రేమగా ఉండాలి, మానవత్వానికి దగ్గరగా ఉండాలి. ఇవన్నీ చేశాకా కూడా అతనికి శక్తి ఉంటే, దాన్ని కళలు, సాహిత్యంపై అధ్యయానికి వినియోగించవచ్చు.
- ఉన్నతుడైన మనిషి గంభీరంగా లేకుంటే, ఇతరుల్లో సంభ్రమాన్ని కలిగించలేడు. నేర్చినవాడు కాకుంటే, స్థిరంగా నిలవలేడు. నిజాయితీ, సద్భావాలను అత్యంత ముఖ్యమైనవిగా చూసుకుంటాడు, సమమైన (లేదా ఉన్నతమైన) సామర్థ్యంలేని స్నేహితులు ఉండరు. తప్పుచేసినప్పుడు, సరిదిద్దుకునేందుకు వెనకాడడు.
- మౌనంగా జ్ఞానం పోగుబడడం; కోల్పోకుండా నేర్చుకోవడం; అలసట లేకుండా సూచనలు ఇవ్వడం: వీటిలో ఏది నాకు చెందేది?
- సరైన పోషణలేకుండా ధర్మాన్ని వదిలేయడం; నేర్చుకున్నదాన్ని క్షుణ్ణంగా చర్చించకపోవడం; విజ్ఞానంతో తెలుసుకున్నాకా ధర్మంవైపుకు కదలకపోవడం; మంచిది కాని దాన్ని మార్చుకోకపోవడం: — ఈ విషయాలు నన్ను ఆందోళనలో పడేసిన సందర్భాలవి.
- ఉన్నతుడైన మనిషి, సురక్షితంగా ఉన్నప్పుడు, ప్రమాదం రావచ్చన్న విషయం మరిచిపోడు. భద్రతతో ఉన్నప్పుడూ పాడైపోయేందుకు అవకాశం ఉందని మరిచిపోడు. అంతా పద్ధతి ప్రకారం ఉన్నప్పుడూ, వైఫల్యం రావచ్చని మరవడు. అందువల్ల అతను ప్రమాదంలో పడడు, అతని రాజ్యాలు, వంశాలూ సురక్షితంగా ఉంటాయి.
- నీకు ఏది జరకూడదనుకుంటావో, దాన్ని ఇతరులకు చేయకు.
- పదిహేనవ అధ్యాయంː24
- గాయాన్ని న్యాయంతో తిరిగివ్వు, దయాగుణానికి దయాగుణంతో తిరిగివ్వుRecompense injury with justice, and recompense kindness with kindness. [1]
- పద్నాలుగవ అధ్యాయం:36
- సౌకర్యాన్ని ప్రేమించే పండితుడు ఆ పేరుకు తగ్గవాడు కాదు.
- తప్పులున్నప్పుడు వాటిని వదిలేసేందుకు భయపడకు.
- ఉన్నతుడైనవాడు ఏది ఒప్పో అర్థంచేసుకుంటాడు; కానివాడు ఏది నడుస్తుందో తెలుసుకుంటాడు.
- ప్రజలను చట్టంతో నడిపించు, శిక్షతో వారిని అణచు; వారు నేరాన్ని త్యజించవచ్చు, సిగ్గులేకుండా అవుతారు. వారికి ఉదాహరణతో నడిపించి, మంచి పద్ధతితో మెత్తబరచండి; వారు సిగ్గుతెచ్చుకుంటారు, మంచిగా మారతారు.
- మెత్తని, మృదువైన, మెరిసేలాంటి తెలివి. దాని అంచులు పదునుగా ఉన్నా న్యాయం కోసినట్టు కోయవు. నేలకు వినయంలా వేళ్ళాడుతూంటుంది. పరుగుతీసినప్పుడు, స్పష్టమైన సంగీతం లాంటి ధ్వనితో శబ్దం చేస్తుంది. దానిలో గీతలు దాగివుండవు, దానికి నిజాయితీని చేర్చి అందంగా తయారుచేయండి. ఏమి ఊహ!
ఇతర వ్యాఖ్యలు
- గాయాల్ని మరచిపోవాలి కానీ అవి మానడానికి సాయపడిన మంచి మనసుల్ని మర్చిపోవద్దు.
- ద్వేషించడం తేలిక, ప్రేమించడం కష్టం
- మంచిని అలవరచుకోడానికి ఎక్కువ కష్టపడాలి [1]
కన్ఫ్యూషియస్ గురించిన వ్యాఖ్యలు
[మార్చు]- కన్ఫ్యూషియస్ మన మతపరమైన ఆలోచనకు అందించినది సిద్ధాంతం కాదు, విశ్వాసంలో ఉండాల్సిన వ్యక్తిగత చేతనపై ప్రాధాన్యత.
- బ్రియాన్ బ్రౌన్, స్టోరీ ఆఫ్ కన్ఫ్యూషియస్: హిజ్ లైఫ్ అండ్ సేయింగ్స్ 1927, పే. 16.
- కన్ఫ్యూషియస్ గొప్పదనాన్ని మెచ్చుకోలేకపోతున్నానని నేను అంగీకరించాలి. అతని రచనలన్నీ మర్యాద యొక్క చిన్నచిన్న విషయాలపై కేంద్రీకృతమైవున్నాయి, అతని ప్రధానదృష్టి వేర్వేరు సందర్భాల్లో సరిగా ప్రవర్తించడాన్ని బోధించడంపైనే వుంది. అతన్ని ఇతర జాతులు, కాలాలకు చెందిన సంప్రదాయక మతబోధకులతో పోల్చిచూసినప్పుడు అతని విశిష్టతలు, వాటిలో ముఖ్యమైనవి వ్యతిరేకమైనవైనా, అంగీకరించితీరాలి. అతని అనుచరులు అభివృద్ధి చేసిన అతని విధానం, మతపరమైన పిడివాదం లేని స్వచ్ఛమైన నైతికత; అది బలమైన మతాధికార వ్యవస్థకు జన్మనివ్వలేదు, ఎలాంటి హింసకూ దారితీయలేదు. సున్నితమైన సభ్యత, పరిపూర్ణమైన మర్యాద కలిగిన మొత్తం దేశాన్ని తయారుచేయడంలో క్చితంగా విజయం సాధించింది. చైనీయుల మర్యాద అనూచానమైనవాటికే పరిమితం కాలేదు; ఆచరించేందుకు పూర్వపద్ధతులు, దృష్టాంతాలు లేని సందర్భాల్లో కూడా అది నమ్మదగ్గదిగా నిలిచింది. అలాగే ఒక తరగతికి పరిమితం కాలేదు; అది చివరకి విధేయుడైన కూలీ వద్ద కూడా ఉంది. తెల్లవారి యొక్క దారుణమైన అమర్యాదని చైనీయులు, అమర్యాదను అమర్యాదతో ఎదుర్కొని తగ్గించుకోలేని, గౌరవంతో స్వీకరించినప్పుడు చూడడం చాలా అవమానకరంగా ఉంటుంది. యూరోపియన్లు దీన్ని తరచుగా బలహీనతగా పరిగణిస్తారు, కానీ ఇది నిజంగా బలం, దీనితోనే ఇంతవరకూ చైనీయులు తమ విజేతలందరినీ జయించారు.
- బెర్ట్రండ్ రస్సెల్, ది ప్రాబ్లెం ఆఫ్ చైనా (1922), అ. 11: చైనీస్ అండ్ వెస్టర్న్ సివిలైజేషన్ కాంట్రాస్టడ్.
- మా గురువు బోధనలు దీనికి విలువనిస్తాయి: 'తనపట్ల తనకు నిజాయితీ, పక్కవారి పట్ల ఔదార్యం'
- త్సెంగ్ ట్జు, ద రిలిజియన్స్ అండ్ ఫిలాసఫీస్ ఆఫ్ ఈస్ట్ (1911)లో, జాన్ మెక్ ఫర్లాండ్ కెనడీ కోట్ చేసినదాని ప్రకారం, పే. 218
- ఎవరో అతని శిష్యులు కన్ఫ్యూషియస్ ని అడిగారు, "మాస్టర్ కాంగ్ ఏమవుతుంది, మనం చనిపోయాకా?" అతనిలా చెప్పాడు "మనకు ఏమీ తెలియనిదాని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు, మనం డీల్ చేయాల్సిన ఈ జీవితం గురించి ఏమీ అగడనప్పుడు?" అతను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే లేదు కనుక.
- గోరె విడాల్, "గోరె విడాల్: ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమ్నీషియా" డాక్యుమెంటరీ సినిమా (2013)
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2024-12-18.