కన్యాశుల్కం
Appearance
కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన సాంఘిక నాటకం. అది మొదటిసారి 1897 లో ప్రచురించబడింది.అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. విజయనగర రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా "కన్యాశుల్కం" అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.
గిరీశం
[మార్చు]- పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్
- డామిట్! కథ అడ్డంగా తిరిగింది
- మన వాళ్ళుత్త వెధవాయిలోయ్
- నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్.
మధురవాణి
[మార్చు]- మాకులానికి అంతా బావలే.
- నేను డబ్బు కక్కుర్తి మనిషికి కాదు.
- చెడనివారిని చెడగొట్టవద్దని ఆ అమ్మ చెప్పింది.
- మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్లు చేస్తే మోసం
రామప్పంతులు
[మార్చు]పిల్లా! అగ్గి పుల్ల!
అగ్నిహోత్రావధాన్లు
[మార్చు]- తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి
వెంకమ్మ
[మార్చు]బుచ్చమ్మ
[మార్చు]వెంకటేశం
[మార్చు]- మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే.
కరటక శాస్త్రి
[మార్చు]- యేమి సాపత్యం తెచ్చావు? కుక్కకి గంగి గోవుకూ యెంత వారో, వాడికి ఆయనకు అంత వార. సౌజన్యరావు పంతులు గారు కర్మణా, మనసా, వాచా యాంటి నాచి. "వేశ్య" అనే మాట, యేమరి ఆయన యదట పలికితివట్టాయనా, "అసందర్భం!" అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలిన వారు యధాశక్తి యాంటీనాచులు. ఫౌజు ఫౌజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పగలు యాంటీనాటి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్న వూళ్లో యాంటీనాచి, పరాయి వూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదార్ఢ్యం వున్నంత కాలం ప్రోనాచి. శరీరం చెడ్డ తరువాత యాంటీనాచి; కొందరు బతికివున్నంత కాల ప్రొనాచి, చచ్చిపోయిన తరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతురలు చచచ్చిన తువాత కూడా ప్రోనాచే. అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్ప ప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె.
మహేశం (కరటక శాస్త్రి శిష్యుడు)
[మార్చు]లుబ్ధావధాన్లు
[మార్చు]మీనాక్షి
[మార్చు]సౌజన్యరావు పంతులు
[మార్చు]బైరాగి
[మార్చు]- వెఱ్ఱి! వెఱ్ఱి! నిజవేవిటి, అబద్ధవేఁవిటి ! మేం సిద్ధులం అబద్ధం నిజం చేస్తాం, నిజం అబద్ధం చేస్తాం - లోకవే పెద్ద అబద్ధం, పదండి
అసిరి గాడు
[మార్చు]సంభాషణలు
[మార్చు]- అగ్ని : అయ్యో నీ యింట కోడి కాల్చా.
- నాయడు:రోజూ కాలుస్తూనే వుంటారు.
- అగ్నిహోత్రావధాన్లు : వీడి శ్రాద్ధం చెట్టు కింద బెట్టా! యేడీ, వెధవని చెంపేస్తాను?
- నాయడు : అల్లుణ్ణి హతవాఁరిస్తే, కూతురు డబ్బిల్ వెధవౌతుంది. శాంతించండి.
- అగ్ని : నీ యింట కోడి గాల్చా!
- నాయడు : అమోఘాశీర్వచనము ! పదండి.