Jump to content

కృతి శెట్టి

వికీవ్యాఖ్య నుండి

కృతి శెట్టి‌ 2003 సెప్టెంబరు 21లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ఆమె నాన్న పేరు కృష్ణ శెట్టి, నీతి శెట్టి. కృతి చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో నటించింది. కృతి శెట్టి చదువు అనంతరం అప్పుడ‌ప్పుడే మోడ‌లింగ్ మొద‌లు పెట్టిన ఆమెకు హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది.[1]

వ్యాఖ్యలు

[మార్చు]
  • నేను కన్నడ కుటుంబం నుంచి వచ్చాను. నేను ముంబైలో పెరిగాను.
  • డాక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని.
  • నేను ఒక విచారకరమైన సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు విచారకరమైన పాటను వింటాను కాబట్టి నేను ఒక పద్ధతి నటిని. ఆ విధంగా, నేను మూడ్ లోకి రావడానికి ప్రయత్నిస్తాను.[2]
  • నటనపై ఆసక్తి ఉన్నా సినిమాలను కెరీర్ గా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.
  • అలాంటి టాలెంటెడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్. అనుభవజ్ఞులైన నటులతో పోటీపడి చాలా బాగా నటించాడు.
  • నేను సైకాలజీ చదువుతున్నప్పుడు 'ఉప్పెన' వచ్చింది. కథ నాకు బాగా నచ్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.